దిగ్విజయ్ తెలంగాణా కాంగ్రెస్ ను నడిపించగలరా?

Published : Apr 22, 2017, 07:29 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
దిగ్విజయ్  తెలంగాణా కాంగ్రెస్ ను నడిపించగలరా?

సారాంశం

దిగ్విజయ్ కు కాంగ్రెస్ పార్టీలో ఒకపుడున్నపలుకుబడి ఇపుడు లేదు. మనిషిగా కళ తగ్గారు. నాయకుడిగా కుంచించుకుపోయారు. పూర్వం అనేక రాష్ట్రాలలో ఆయన కనిపించని సిఎంగా ఉండేవారు. ఇపుడు ఆయన పలుకుబడి టెన్ జనపథ్ కు పరిమితమయింది.

కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్  పరిస్థితి ఏమీ బాగా లేదు. బాగా లేదని మీడియా వాళ్లనడం కాదు, ఆయన ఎక్కడకి పోయినా అదే రుజువవుతూ ఉంది.

 

 ఆయన కళ్లముందే తెలంగాణా కాంగ్రెసోళ్లు తెగ తిట్టుకున్నారు. తన్నుకున్నారు.

 

తెలంగాణా ఇన్ చార్జ్ జనరల్ సెక్రటెరీ ఎదురుగా ఉన్నాడన్న భయం భక్తీ ఎవరిలో కనిపించలే.

 

రేయ్ అంటే రేయ్ అనుకున్నారు. నువ్వెంతంటే నువ్వెంతనుకున్నారు. తన్నులాటకు కూడా వెనకాడలేదు.

 

దిగ్విజయ్ కు కాంగ్రెస్ పార్టీలో ఒకపుడున్నపలుకుబడి ఇపుడు లేదు. మనిషిగా కళ తగ్గారు. నాయకుడిగా కుంచించుకుపోయారు. పూర్వం అనేక రాష్ట్రాలలో ఆయన కనిపించని సిఎంగా ఉండేవాడు. ఇపుడు ఆయన పలుకుబడి టెన్ జనపథ్ కు పరిమితమయింది.

 

పార్టీని అంటిపెట్టుకున్న పెద్ద మనిషి, విధేయుడు, చదువుకున్నవాడు అనేవి ఆయన క్వాలిఫికేషన్లు. ఒకసారికి మించి  ముఖ్యమంత్రిగా నాయకులు కొనసాగలేని రోజుల్లో ఆయన రెండో దఫా ముఖ్యమంత్రి అయి ప్రధానమంత్రి మెటిరియల్ అనిపించుకున్నారు. అదంతా చరిత్ర. ఎపుడూ గుర్తుపెట్టుకోవాలంటే కుదరదు.  ఆ బుర్రకథ చెప్పుకుంటూఎల్లకాలం వూరేగడం కూడా కష్టం.

 

ఇపుడు ఈ కష్టాల్లోనే దిగ్విజయ్ అంకుల్ ఉన్నారు. రాహుల్ గాంధీకి ప్రధాన సలహాదారు ఆయన. ఆయన సలహాల వల్ల ఉత్తర  ప్రదేశ్ లో కాంగ్రెస్ కేమీ రాలేదు. కాకపోయింది కూడా ఏమీలేదు. ఎందుకంటే అక్కడ పోయేకేమ్మిగిలింది కనక.

 

నిన్న గాంధీ భవన్ లో మాజీ భువనగిరి ఎంపి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టిపిసిసి కోశాధికారి గూడురు నారాయణరెడ్డికొట్టాడుకోవడం దిగ్విజయ్ వైఫల్యానికి ఒక నిదర్శనం. ఒక పదేళ్ల కిందట ఆయన మాటకు తిరుగుండేది కాదు. ఇలాంటి పీకులాట వచ్చినపుడు, ఇరువర్గాలు తమ వాదన వినిపించి, తుదినిర్ణయం అధిష్టానానికి వదిలేసే వాళ్లు. తర్వాత దిగ్విజయ్  సమక్షంలో వ్యవహారం ఇంతదాకా వచ్చేది కాదు. ఇపుడు అంత ప్రభావం చూపే శక్తి ఆయనలో పోయింది. కాంగ్రెస్ హై కమాండ్ పవర్ కూడా కొంత తగ్గింది. ఉన్నట్లుండి తెలంగాణా ఇవ్వాలని  ప్రకటించి ఆంధ్ర కాంగ్రెసోళ్లను, తెలంగాణ కాంగ్రెసోళ్లను దిగ్విజయ్ తలకిందులు చేశారు. తెలంగాణా ఇచ్చాక దాన్నెలసొమ్ముచేసుకోవాలో  తెలంగాణాలో వ్యూహంలేదు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చాం కాబట్టి వోట్ల ఆటో మేటిక్ గా వానాకాలంలో బెకబెక లాడుకుంటూ కప్పలొచ్చినట్లు వోట్లొస్తాయనుకున్నారు. ఇక ఆంధ్రలో కూడాఅంతే,  తెలంగాణాకు అందరికంటే ముందు లేఖ రాసిచ్చిన చంద్రబాబు నవ్యాంధ్ర నిర్మాతవుతానని చెప్పుకుని మరీ గెల్చారు. ఇవన్నీ దిగ్విజయ్ ప్రభావాన్నిబాగా తగ్గించేశాయి.

 

దీనికితోడు ఇపుడేం జరుగుతూ ఉంది, గోవా ఎన్నికల తర్వాత, అసలు గోవా చేజారి పోయేందుకు డిగ్గీరాజావారే కారణమని అంతా ఆయన మీదికి ఉరుకుతున్నారు. అసలు ఆయన్ని పెరికేయండి పదవుల్నుంచి అంటున్నారు. అలా అనిందెవరో కాదు, తెలంగాణా కాంగ్రెస్ అడపడచు,రేణుకా చౌదరియే. ఆమెకు కోపమొచ్చి ఏకంగా  గోవాపోవడం స్టుపిడ్ అని అరిచేసిందొక మీటింగ్ లో. దిగ్విజయ్ సింగ్ ని జనరల్ సెక్రెటరీ పదవి నుంచి తీసేయండని కూడా డిమాండ్ చేసింది. ఆయన స్పీడుగా ఏ నిర్ణయం తీసుకోలేనందునే గోవాలో  ప్రభుత్వంఏర్పాటుచేయలేకపోయిందని ఆమె విమర్శించారు. 

 

ఇలా గే చాలా మంది సీనియర్ లీడర్లు, దిగ్విజయ్ ని అనేక రాష్ట్రాల ఇన్చచార్జ్ గా కొనసాగనీయాడానికి వ్యతిరేకంగా ఉన్నారు.

 

ఇలాంటపుడు తెలంగాణా కాంగ్రెస్ తగవులను తీర్చే నైతిక శక్తి  డిగ్గీరాజాకు ఉంటుందా?

PREV
click me!

Recommended Stories

Jabardasth Anchor Rashmi Gowtham Pressmeet: మీ సంస్కృతి అంతా మా బట్టలపైనే ఉంది| Asianet News Telugu
Harish Rao Comments on Revanth Reddy:టెండర్లురద్దు చేసి సిబిఐవిచారణ జరిపించాలి | Asianet News Telugu