కడెం ప్రాజెక్టుకు ముప్పు తప్పిందని అధికారులు ప్రకటించారు. ఇన్ ఫ్లో తగ్గడంతో ఇబ్బంది లేదని అధికారులు చెప్పారు. మరో వైపు ప్రాెక్టుకు వస్తున్న వరదను 17 గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు.
నిర్మల్: kadam ప్రాజెక్టుకు ముప్పు తప్పిందని అధికారులు ప్రకటించారు. ఎగువ నుండి ఇన్ ఫ్లో కూడా భారీగా తగ్గిందని అధికారుులు చెబుతన్నారు. ప్రాజెక్టు 17 గేట్ల ద్వారా 2.95 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఈ ప్రాజెక్టుకు 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. దీంతో ప్రాజెక్టు దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రాజెక్టు డిశ్చార్జి కెపాసిటీ మూడు లక్షల కెపాసిటీ. దీంతో అధికారులు ప్రాజెక్టు దిగువన ఉన్న 25 గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రాజెక్టుకు ఉన్న 18 గేట్లలో ఒక్క గేటు తెరుచుకోలేదు. అయితే ఎగువ నుండి వచ్చిన వరద ప్రాజెక్టు ఎడమ కాలువ వైపునుండి దిగువకు వెళ్లింది., ప్రాజెక్టుకు ఎడమ కాలువ కొంత మేర దెబ్బతిందని అధికారులు చెబుతున్నారు. ఎడమ కాలువతో పాటు మరో రెండు చోట్ల కూడా ప్రాజెక్టు దెబ్బతిందని అధికారులు గుర్తించారు. ప్రాజెక్టుకు ప్రమాదం తప్పిందని అధికారులు తేల్చి చెప్పడంతో స్థానికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఐదు లక్షల క్యూసైెక్కుల నీరు రావడంతో ప్రాజెక్టు పై నుండి వరద నీరు ప్రవహించింది. వరద నీటిలో కొట్టుకు వచ్చిన చెత్త, చెట్టు కొమ్మలు ప్రాజెక్టు పై భాగంలో ఉన్నాయి.
కడెం ప్రాజెక్టు వరద డిశ్చార్జ్ కెపాసిటీ 3 లక్షల క్యూసెక్కులు. తొలుత ఈ ప్రాజెక్టు డిశ్చార్జ్ కేవలం లక్షన్నర క్యూసెక్కులు, అయితే 1957 లో వచ్చిన వరద కారణంగా ప్రాజెక్ట్ డిశ్చార్జ్ కెపాసిటీని పెంచారు. ప్రాజెక్టు గేట్ల సంఖ్యను పెంచారు. దీంతో ప్రాజెక్ట్ నుండి మూడు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఏర్పడింది.
undefined
also read:భారీ వర్షాలు: మంచిర్యాలలో నీట మునిగిన కాలనీలు, నిలిచిన రాకపోకలు
కడెం ప్రాజెక్టు పరిస్థితిపై తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం నాడు ఆరా తీశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడడికి ఫోన్ చేసి ప్రాజెక్టు పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు సీఎం కేసీఆర్. ఇరిగేషన్ అధికారులతో కూడా ఈ విషయమై అడిగి తెలుసుకున్నారు.