ఎమ్మెల్సీ కవిత 48 గంటల్లో అరెస్ట్ కాబోతుంది.. కేసీఆర్ దేవుడినే శత్రువు చేసుకున్నారు: కేఏ పాల్

Published : Mar 08, 2023, 01:45 PM IST
ఎమ్మెల్సీ కవిత 48 గంటల్లో అరెస్ట్ కాబోతుంది.. కేసీఆర్ దేవుడినే శత్రువు చేసుకున్నారు: కేఏ పాల్

సారాంశం

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చిన సంగతి  తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత 48 గంటల్లో అరెస్ట్ కాబోతుందని జోస్యం చెప్పారు. మార్చి 10వ తేదీన కవిత అరెస్ట్ అవుతుందని అన్నారు. కేసీఆర్ పతనానికి ఇది ఆరంభం మాత్రమేనని అన్నారు. ఎందుకంటే తెలంగాణలో రైతుల కన్నీరు, నిరుద్యోగుల కన్నీరు, అమరవీరుల కుటుంబాల కన్నీరు, అనేక మంది ప్రజలు ఉసురు కేసీఆర్ కుటుంబానికి తగిలిందని విమర్శించారు. కేసీఆర్ దేవుడినే శత్రువు చేసుకున్నారని అన్నారు. 

ఇదిలా ఉంటే.. ఇదిలా ఉంటే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. గతంలో ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు కవితను సాక్షిగా విచారించిన సంగతి తెలిసిందే. మరోవైపు  ఇప్పటికే చార్జ్‌షీట్లలో కవిత పేరును పలు సందర్భాల్లో ప్రస్తావించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ కోర్టు.. తాజాగా ఈ కేసులో అరెస్ట్ చేసిన అరుణ్ రామచంద్ర పిళ్లై న్యాయస్థానంలో హాజరుపరిచిన సందర్భంగా రిమాండ్ రిపోర్టులో కీలక అభియోగాలు మోపింది. కవితకు అరుణ్ రామచంద్ర పిళ్లై బినామీ అని తెలిపింది. ఈ కేసులో అరెస్టయిన సమీర్ మహేంద్రుని ఇండోస్పిరిట్ గ్రూప్‌లో పిళ్లై కూడా భాగస్వామిగా ఉన్నారని.. ఎల్ 1 లైసెన్స్ ఉన్న ఇండోస్పిరిట్‌లో పిళ్లైకి 32.5 శాతం వాటా ఉండగా, ప్రేమ్ రాహుల్‌కు కూడా 32.5 శాతం వాటా ఉందని ఈడీ తెలిపింది.

 


ప్రేమ్ రాహుల్, అరుణ్ రామచంద్ర పిళ్లైలు.. కవిత, ఏపీ వైఎస్ఆర్‌సీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిలకు బినామీలుగా ప్రాతినిధ్యం వహించారని ఈడీ తన నివేదికలో పేర్కొంది. భాగస్వామ్య సంస్థలో కవిత వ్యాపార ప్రయోజనాలకు పిళ్లై ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఈడీ పేర్కొంది. ఇక, ఈ కేసుకు సంబంధించి అరుణ్ రామచంద్ర పిళ్ళైని కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోరగా.. 7 రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది.

ఈ క్రమంలోనే తాజాగా ఈడీ అధికారులు కవితకు నోటీసులు జారీచేశారు. గురువారం (మార్చి 9)రోజున ఢిల్లీలో  విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. రామచంద్ర పిళ్లైతో కలిసి కవితను విచారించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాను ఈడీ విచారణకు హాజరయ్యేందుకు కవిత సమయం కోరారు. ఈ నెల 15వ తేదీ తర్వాత విచారణకు హాజరవుతానని ఈడీకి రాసిన లేఖలో కవిత పేర్కొన్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్డ్ కార్యక్రమాల వల్ల రేపు విచారణకు రాలేనని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్