కోర్టుకెళ్లి నిజాయితీ నిరూపించుకోవాలి: కవితకు ఈడీ నోటీసులపై బండి

By narsimha lode  |  First Published Mar 8, 2023, 1:08 PM IST

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు  ఈడీ నోటీసులపై  బీఆర్ఎస్ రాజకీయం  చేస్తుందని బీజేపీ విమర్శించింది.  ఈ నోటీసులతో  తమ పార్టీకి  ఎలాంటి సంబంధం లేదని  బండి సంజయ్  చెప్పారు.
 



హైదరాబాద్:తప్పు చేయకపోతే   కోర్టుకు వెళ్లి తన నిజాయితీని  నిరూపించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కవితకు  సూచించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కవితకు  ఈడీ నోటీసులపై  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  బుధవారం నాడ  స్పందించారు. కవితకు  నోటీసులకు తెలంగాణ సమాజానికి  ఏం సంబంధం ఏముంటుందని ఆయన  ప్రశ్నించారు.  

ఢిల్లీ లిక్కర్ స్కాంపై  కేసీఆర్, కేటీఆర్ ఎందుకు  స్పందించడం లేదని  ఆయన  ప్రశ్నించారు. కవిత  కారణంగా  తెలంగాణ తలదించుకొనే  పరిస్థితి వచ్చిందని  బండి సంజయ్  అభిప్రాయపడ్డారు. చట్టం తన పని తాను  చేసుకుంటుపోతుందన్నారు..   తప్పు చేసిన వారంతా  విచారణను ఎదుర్కోవాల్సిందేనని  ఆయన  చెప్పారు.  సీబీఐ, ఈడీ విచారణకు  కవిత  సహకరించాలని  ఆయన  సూచించారు.  లిక్కర్ స్కాంలో  నిందితులు  తనకు  పరిచయస్తులేనని  కవిత  ఓ టీవీ ఇంటర్వ్యూలో  చెప్పారని  బండి  సంజయ్ గుర్తు  చేశారు.

Latest Videos

also read:రేపు విచారణకు హాజరు కాలేను: ఈడీకి కవిత లేఖ

తెలంగాణ ఉద్యమంలో  పాల్గొన్న  మహిళలకు  ఎమ్మెల్సీ  ఇవ్వరా అని  ఆయన ప్రశ్నించారు.  బీఆర్ఎస్ లో  మహిళా విభాగమే లేదన్నారు.  బీఆర్ఎస్  మహిళా విభాగం  అధ్యక్షురాలు  ఎవరో తెలియదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో  మహిళలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగాయని  ఆయన  చెప్పారు.  తొలి ఐదేళ్లలో  ఒక్క మహిళ  కూడ  కేసీఆర్ కేబినెట్ లో  లేరన్నారు. మహిళా  దినోత్సవం  నిర్వహించే  అర్హత బీఆర్ఎస్ కు లేదన్నారు.  గిరిజన మహిళను  రాష్ట్రపతి  చేసే విషయంలో  బీఆర్ఎస్ అడ్డుపడిందని  ఆయన విమర్శించారు.
 

click me!