ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంతో ఆ పార్టీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఆమెతో సమావేశమయ్యారు.
హైదరబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఎమ్మెల్సీ కవితతో బుధవారంనాడు భేటీ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కవితతో గణేష్ సమావేశమయ్యారు.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసుల విషయమై కవితతో గణేష్ చర్చించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవం రోజునే కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడాన్ని గణేష్ గుప్తా తప్పుబట్టారు. ఈ ఘటన మహిళలను అవమానించడమేనని ఆయన పేర్కొన్నారు. బీజేపీ చెప్పినట్టే ఈడీ,సీబీఐ, ఐటీ నడుస్తుందని అర్ధమౌతుందని గణేష్ గుప్తా విమర్శలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ కుంభకోణంలో కవిత అరెస్టు అవుతారని బీజేపీ నేతలు గతంలో ప్రకటించారు.
బీజేపీ నేతలు చెప్పినట్టుగా దర్యాప్తు సంస్థలు పనిచేస్తాయా అని కవిత రెండు రోజుల క్రితమే వ్యాఖ్యానించారు. బీజేపీ, దర్యాప్తు సంస్థల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ను ఈ వ్యాఖ్యలు తెలుపుతున్నాయని కవిత చెప్పారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేశాయి దర్యాప్తు సంస్థలు . అరెస్టైన వారిలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. ఈ స్కాంలో సౌత్ గ్రూప్ కీలకంగా వ్యవహరించిందని దర్యాప్తు సంస్థలు ఆరోపణలు చేశాయి. ఈ దిశగానే దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి.
also read:కోర్టుకెళ్లి నిజాయితీ నిరూపించుకోవాలి: కవితకు ఈడీ నోటీసులపై బండి
ఢిల్లీ లిక్కర్ స్కాంలో దర్యాప్తు సంస్థలు పలు దఫాలు అరుణ్ రామచంద్రపిళ్లైని విచారించారు. నిన్న అరుణ్ రామచంద్రపిళ్లైని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కవిత ప్రతినిధిగా తాను వ్యవహరాలు నడిపినట్టుగా అరుణ్ రామచంద్ర పిళ్లై ఈడీ విచారణలో చెప్పారు. ఈ విషయాన్నిఅరుణ్ రామచంద్రపిళ్లై రిమాండ్ రిపోర్టులో ఈడీ ప్రస్తావించింది. ఈ రిమాండ్ రిపోర్టు ఆధారంగా కవితకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసినట్టుగా ప్రచారం సాగుతుంది. ఇవాళ ఉదయం కవితకు ఈడీ అధికారులు నోటీసులిచ్చారు.