రాజ్యసభలో దిశ ఘటనపై చర్చ: 31లోగా ఉరితియ్యాలని డిమాండ్

By Nagaraju penumala  |  First Published Dec 2, 2019, 11:33 AM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ రాష్ట్రంలోని దిశ హత్య ఘటనపై రాజ్యసభలో చర్చకు పట్టుబట్టింది కాంగ్రెస్ పార్టీ. మహిళలపై దాడులను తీవ్రంగా ఖండిస్తూ రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ డిమాండ్ చేశారు. 


న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ రాష్ట్రంలోని దిశ హత్య ఘటనపై రాజ్యసభలో చర్చకు పట్టుబట్టింది కాంగ్రెస్ పార్టీ. మహిళలపై దాడులను తీవ్రంగా ఖండిస్తూ రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ డిమాండ్ చేశారు. 

రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ డిమాండ్ తో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు చర్చకు ఆమోదం తెలిపారు. దాంతో అన్ని పార్టీల నేతలు మహిళలపై దాడులను తీవ్రంగా ఖండించాయి. ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళలపై దాడులు ఆగడం లేదన్నారు. చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. 

Latest Videos

undefined

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఘటనపై న్యాయస్థానాలు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులకు ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. 

లోక్ సభలో దిశహత్యపై చర్చకు రేవంత్ పట్టు: స్పీకర్ ఓం బిర్లా విచారం

డిసెంబర్ 31లోపు నలుగురు ఎంపీలకు ఉరి వేయాలని ఏఐడీఎంకే ఎంపీ డిమాండ్ చేశారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దని వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉంటాయని తెలిపారు. 
 
ఇకపోతే బుధవారం సాయంత్రం దిశని నలుగురు నిందితులు అత్యంత దారుణంగా రేప్ చేసి హత్య చేశారు. తొడుపల్లి దగ్గర దిశ స్కూటీ పార్క్ చేయడం చూసిన లారీ డ్రైవర్ మహ్మాద్ పాషా ఉద్దేశపూర్వకంగా ఆమె స్కూటీ పంక్చర్ అయ్యిందని కుట్ర పన్నారు. 

కేసులో ఏ3గా ఉన్న జొల్లు నవీన్ స్కూటీ బ్యాక్ టైర్ లో గాలి తీసేశారు. గచ్చిబౌలి నుంచి దిశ తొండుపల్లి వద్దకు రాగానే బ్యాక్ టైర్ పంక్చర్ అయ్యిందని నమ్మించారు. పంక్చర్ వేయిస్తామని చెప్పగానే ఆమె స్కూటీ ఇచ్చేసింది. పంక్చర్ వేయిస్తామని తీసుకెళ్లిన వారు గాలి కొట్టించి తిరిగి ఇచ్చేశారు.

అనంతరం ఆమెను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. అత్యాచార సమయంలో యువతి కేకలు వేయడంతో నోరు మూయడంతో ఊపిరి ఆడక చనిపోయినట్లు పోలీసులు నిర్థారించారు. అనంతరం చటాన్ పల్లి బ్రిడ్జ్ దగ్గర కిరోసిన్ పోసి నిప్పంటించి తగులబెట్టారు. 

చర్లపల్లి జైల్లో దిశ హత్యకేసు నిందితులు: తొలి రోజే మటన్ తో భోజనం

ఇకపోతే హత్య కేసులో డ్రైవర్‌ ఏ1మహ్మద్ ఆరిఫ్, ఏ2 క్లీనర్‌ జొల్లు శివ (20), ఏ3 జొల్లు నవీన్‌ (23), ఏ4 క్లీనర్‌ చెన్న కేశవులు (లారీ డ్రైవర్‌)ను అరెస్ట్ చేసినట్లు సీపీ సజ్జనార్ మీడియాకు స్పష్టటం చేశారు. తెలిపారు. వైద్యురాలి హత్య కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు సీపీ సజ్జనార్‌ తెలిపారు. 

ఇకపోతే నిందితులు ప్రస్తుతం చర్లపల్లి జైల్లో రిమాండ్ లో ఉన్నారు. ఇకపోతే తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాలతో కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును నియమించింది తెలంగాణ ప్రభుత్వం. వీలైనంత త్వరలో కేసు విచారణ పూర్తి చేసి నిందితులకు శిక్ష విధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 

 
 

click me!