దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్: కేసు నమోదు చేసిన పోలీసులు

By telugu teamFirst Published Dec 7, 2019, 10:52 AM IST
Highlights

వెటర్నరీ డాక్టర్ దిశ రేప్, హత్య కేసులో నిందితులు ఎన్ కౌంటర్ లో మరణించిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. షాద్ నగర్ ఏసీపీ సురేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్ కౌంటర్ పై కేసు నమోదైంది.

షాద్ నగర్: వెటర్నరీ డాక్టర్ దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ మీద పోలీసులపై కేసు నమోదైంది. దిశ కేసు నిందితులు నలుగురిని పోలీసులు ఎన్ కౌంటర్ లో హతమార్చిన విషయం తెలిసిందే. షాద్ నగర్ ఏసీపీ సురేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్ కౌంటర్ మీద కేసును నమోదు చేశారు. 

ఇదిలావుంటే, ఎన్ కౌంటర్ జరిగిన స్థలంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిందితులకు తగిలిన బుల్లెట్ల కోసం వారు గాలిస్తున్నారు. కొన్ని బుల్లెట్లను బాంబ్ స్క్వాడ్ సేకరించింది. 

Latest Videos

సురేందర్ దిశ హత్య కేసు విచారణాధికారిగా ఉన్నారు. దిశ రేప్, హత్య కేసులో నిందితులను సీన్ రీకనస్ట్రక్షన్ కోసం సంఘటనా స్థలానికి తీసుకుని వెళ్లిన సమయంలో ఎన్ కౌంటర్ జరిగింది. నిందితులు పోలీసులపై ఎదురు తిరిగి పారిపోవడానికి ప్రయత్నిస్తూ దాడి చేయడంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారని, ఈ ఎదురు కాల్పుల్లో నిందితులు మరణించారని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ చెప్పిన విషయం తెలిసిందే.

Also Read: దిశకు న్యాయం చేశారు... మరి మా కూతుళ్లకు న్యాయమేది?

గత నెల 27వ  తేదీన నిందితులు శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి ఔటర్ రింగ్ వద్ద దిశపై గ్యాంగ్‌రేప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.

ఈ కేసు విషయంలో పోలీసులు కూడ కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలు వెల్లువెత్తాయి.దిశ హత్య కేసు విచారణ కోసం మహాబూబ్ నగర్ లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేశారు. 

Also Read: దిశ నిందితుల ఎన్ కౌంటర్... విజయశాంతి రెస్పాన్స్ ఇదే

షాద్ నగర్ కోర్టు నుండి మహాబూబ్ నగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు కేసు విచారణ బదిలీ చేయాల్సి ఉండింది. ఈ సమయంలోనే సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో నిందితులు ,పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పోలీసుల ఎన్ కౌంటర్ లో నిందితులు చనిపోయారు

click me!