దిశకు న్యాయం చేశారు... మరి మా కూతుళ్లకు న్యాయమేది?

By telugu team  |  First Published Dec 7, 2019, 8:23 AM IST

యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలంలోని హజీపూర్‌ గ్రామానికి చెందిన శ్రీనివా్‌సరెడ్డి ముగ్గురు చిన్నారులపై అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేసి, బావిలో పడేసిన విషయం తెలిసిందే. అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై బాధిత కుటుంబాలు మండిపడుతున్నాయి.


దిశ కేసులో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఈ ఎన్ కౌంటర్ పై చాలా మంది హర్షం వ్యక్తం చేశారు. ముందుగా దిశ కుటుంబసభ్యులు ఆనందపడ్డారు. దిశ ఆాత్మకు శాంతి కలిగిందని అందరూ అభిప్రాయపడ్డారు. అయితే... దిశ హత్య కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేశారు.. మంచి విషయమే...మరి మా కూతుళ్లను అతి కిరాతకంగా చంపిన వాళ్లను మాత్రం ఎందుకు శిక్షించలేదు..? మా బిడ్డలకు మాత్రం ఆత్మ శాంతించొద్దా అంటూ కొందరు బాధితులు ప్రశ్నిస్తున్నారు.

యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలంలోని హజీపూర్‌ గ్రామానికి చెందిన శ్రీనివా్‌సరెడ్డి ముగ్గురు చిన్నారులపై అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేసి, బావిలో పడేసిన విషయం తెలిసిందే. అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై బాధిత కుటుంబాలు మండిపడుతున్నాయి.

Latest Videos

దిశ నిందితుల్లాగా శ్రీనివాసరెడ్డినీ శిక్షించాలంటూ బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు శుక్రవారం ధర్నా చేశారు. మరోవైపు జడ్చర్లకు చెందిన ఓ బాలికను సోషల్‌ మీడియాలో పరిచయం చేసుకుని ఆగస్టు 29న హత్య చేసిన నిందితుడినీ ఎన్‌కౌంటర్‌ చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. కాగా.. దిశ హత్య కంటే ఒకరోజు ముందు హన్మకొండలో ఓ యువతిపై ఆమె పుట్టినరోజు నాడే అత్యాచారం జరిపి హత్య చేసిన నిందితుడు సాయిని వెంటనే ఎన్‌కౌంటర్‌ చేయాలని యువతి తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.
 
వరంగల్‌లో పెళ్లికి ఒప్పుకోలేదని పెట్రోలు పోసి కాల్చిన నిందితుడిని, 2017లో ఓ మహిళపై యాసిడ్‌ పోసి స్ర్కూడ్రైవర్‌తో కళ్లలో పొడిచి అతి దారుణంగా చంపిన నిందితుడు చందూ, అతని ఇద్దరు మిత్రులకు వెంటనే చంపేయాలని బాధితురాలి బంధువులు కోరుతున్నారు.

గతేడాది ధర్మసాగర్‌ మండలం బంజరుపల్లిలో 62ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం జరిపి హత్య చేసిన ముగ్గురిని వెంటనే ఎన్‌కౌంటర్‌ చేయాలని గ్రామస్థులు, బంధువులు డిమాండ్‌ చేస్తున్నారు. హన్మకొండలో జూన్‌లో 9 నెలల పసిపాపను ఎత్తుకెళ్ళి అత్యాచారం జరిపి హత్యచేసిన నిందితుడు ప్రవీణ్‌ను ఎన్‌కౌంటర్‌ చేయాలని పాప తండ్రి కోరారు.

click me!