దిశ నిందితుల ఎన్ కౌంటర్.. వరంగల్ బాధితురాలి పేరెంట్స్ షాకింగ్ కామెంట్స్

Published : Dec 07, 2019, 09:33 AM IST
దిశ నిందితుల ఎన్ కౌంటర్.. వరంగల్ బాధితురాలి పేరెంట్స్ షాకింగ్ కామెంట్స్

సారాంశం

తమ బిడ్డను చంపింది నలుగురు నిందితులని.. కానీ పోలీసులు మాత్రం ఒక్కడే అని అబద్ధం చెబుతున్నారన్నారు. తమ బిడ్డను చంపిన నిందితులను కూడా ఎన్‌కౌంటర్‌ చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు

దిశ హత్య జరిగిన రోజు తర్వాతే... వరంగల్ లో ఓ యువతి పుట్టిన రోజు నాడే హత్య కు గురైంది. ఆమె స్నేహితుడే... అత్యాచారం చేసి.. అనంతరం హత్య చేశాడు. కాగా.... ఆ యువతి తల్లిదండ్రులు ఇప్పుడు దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై స్పందించారు.

తమ బిడ్డను చంపింది నలుగురు నిందితులని.. కానీ పోలీసులు మాత్రం ఒక్కడే అని అబద్ధం చెబుతున్నారన్నారు. తమ బిడ్డను చంపిన నిందితులను కూడా ఎన్‌కౌంటర్‌ చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. తమ బిడ్డను చిత్రహింసలు పెట్టి చంపారని బాధితురాలి తల్లిదండ్రులు చెబుతున్నారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై వారు హర్షం వ్యక్తం చేశారు.

వరంగల్ అర్బన్ జిల్లాలో పుట్టినరోజున గుడికి వెళ్లి వస్తానని తల్లిదండ్రులకు చెప్పి వెళ్లిన ఓ యువతి శవమై తేలిన సంగతి తెలిసిందే. తీరా చూస్తే ప్రియుడే ఇంటి నుంచి బయటికి రమ్మని అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. పోలీసులు నిందితుడిని తరువాతి రోజే అరెస్టు చేశారు. 

PREV
click me!

Recommended Stories

నిఘా నీడలో తెలంగాణ ఆర్టీసీ ఆకతాయిలు, పోకిరీలకు చెక్ | CCTV in TSRTC buses | Asianet News Telugu
CM Revanth Reddy Praises Nirmal Women’s Groups for 100% Loan Repayment | Asianet News Telugu