Justice for Disha: నిందితుడికి ప్రాణాంతక వ్యాధి, ఆర్నెళ్లకోసారి..

By Nagaraju penumalaFirst Published Dec 2, 2019, 3:18 PM IST
Highlights

గత కొంతకాలంగా నిమ్స్ ఆస్పత్రిలో ప్రతీ ఆరు నెలలకు ఒకసారి డయాలసిస్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. నిందితుడు మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్నారని తెలిసిందని అయితే అతనికి తాము సైతం చికిత్స అందిస్తామని తెలిపారు చర్లపల్లి జైలు సిబ్బంది. 

హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ వైద్యురాలు దిశపై రేప్, హత్య ఘటనలో నిందితుడు చింతకుంట చెన్నకేశవులు మూత్రపిండాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు జైలు అధికారులు నిర్ధారించారు. 

చెన్నకేశవులు గత కొంతకాలంగా మూత్రపిండాల సంబంధింత వ్యాధితో బాధపడుతున్నాడని జైలు అధికారులు స్పష్టం చేశారు. ప్రతీ ఆరు నెలలకు ఒకసారి నిందితుడు చెన్నకేశవులు డయాలసిస్ చేయించుకుంటున్నాడని మెడికల్ రిపోర్ట్ లో తెలిసినట్లు జైలు అధికారులు స్పష్టం చేశారు. 

లారీ క్లీనర్ గా పనిచేస్తున్న చెన్నకేశవులు డ్రైవింగ్ కూడా చేస్తాడని సమాచారం. గత కొంతకాలంగా నిమ్స్ ఆస్పత్రిలో ప్రతీ ఆరు నెలలకు ఒకసారి డయాలసిస్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. 

నిందితుడు మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్నారని తెలిసిందని అయితే అతనికి తాము సైతం చికిత్స అందిస్తామని తెలిపారు చర్లపల్లి జైలు సిబ్బంది. చెన్నకేశవులుకు వైద్యం అందిస్తున్న నిమ్స్ వైద్యులను తాము సంప్రదించబోతున్నట్లు తెలిపారు. 

తెలంగాణ నిర్భయ కేసు: నిందితుల కస్టడీ కోసం పోలీసుల పిటిషన్

ఇకపోతే బుధవారం సాయంత్రం దిశని నలుగురు నిందితులు అత్యంత దారుణంగా రేప్ చేసి హత్య చేశారు. తొడుపల్లి దగ్గర దిశ స్కూటీ పార్క్ చేయడం చూసిన లారీ డ్రైవర్ మహ్మాద్ పాషా ఉద్దేశపూర్వకంగా ఆమె స్కూటీ పంక్చర్ అయ్యిందని కుట్ర పన్నారు. 

కేసులో ఏ3గా ఉన్న జొల్లు నవీన్ స్కూటీ బ్యాక్ టైర్ లో గాలి తీసేశారు. గచ్చిబౌలి నుంచి దిశ తొండుపల్లి వద్దకు రాగానే బ్యాక్ టైర్ పంక్చర్ అయ్యిందని నమ్మించారు. పంక్చర్ వేయిస్తామని చెప్పగానే ఆమె స్కూటీ ఇచ్చేసింది. పంక్చర్ వేయిస్తామని తీసుకెళ్లిన వారు గాలి కొట్టించి తిరిగి ఇచ్చేశారు.

చర్లపల్లికి ప్రియాంక నిందితులు: హై సెక్యూరిటీ బ్లాక్‌లో సెల్, ఖైదీ నెంబర్లు ఇవే

అనంతరం ఆమెను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. అత్యాచార సమయంలో యువతి కేకలు వేయడంతో నోరు మూయడంతో ఊపిరి ఆడక చనిపోయినట్లు పోలీసులు నిర్థారించారు. అనంతరం చటాన్ పల్లి బ్రిడ్జ్ దగ్గర కిరోసిన్ పోసి నిప్పంటించి దహనం చేశారు. 

దిశ హత్య కేసులో డ్రైవర్‌ ఏ1మహ్మద్ ఆరిఫ్, ఏ2 క్లీనర్‌ జొల్లు శివ (20), ఏ3 జొల్లు నవీన్‌ (23), ఏ4 క్లీనర్‌ చెన్న కేశవులు (లారీ డ్రైవర్‌)ను అరెస్ట్ చేసినట్లు సీపీ సజ్జనార్ మీడియాకు స్పష్టటం చేశారు. తెలిపారు. వైద్యురాలి హత్య కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సీపీ సజ్జనార్‌ తెలిపారు. 

ఇకపోతే నిందితులు ప్రస్తుతం చర్లపల్లి జైల్లో రిమాండ్ లో ఉన్నారు. ఇకపోతే తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాలతో కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును నియమించింది తెలంగాణ ప్రభుత్వం. వీలైనంత త్వరలో కేసు విచారణ పూర్తి చేసి నిందితులకు శిక్ష విధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 

చర్లపల్లి జైల్లో దిశ హత్యకేసు నిందితులు: తొలి రోజే మటన్ తో భోజనం

click me!