hikes bus charges: ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు: నేటి అర్ధరాత్రి నుండి అమల్లోకి

By narsimha lodeFirst Published Dec 2, 2019, 2:20 PM IST
Highlights

ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. పెంచిన బస్ చార్జీలు ఇవాళ అర్ధరాత్రి నుండి అమల్లోకి రానున్నాయి.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ అర్ధరాత్రి నుండి బస్సు ఛార్జీలను పెరగనున్నాయి. బస్సు ఛార్జీలతో పాటు బస్సు పాసుల ధరలు కూడ పెరుగుతాయి. నష్టాల్లో ఉన్న సంస్థను కాపాడుకొనేందుకు చార్జీల పెంపు అనివార్యమైందని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు.

సుమారు 55 రోజుల తర్వాత ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించారు. సమ్మె  చేస్తున్న కార్మికులను విధుల్లోకి తీసుకొంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ ఏడాది నవంబర్ 29వ తేదీ నుండి ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరారు.

నష్టాల్లో ఉన్న ఆర్టీసీ సంస్థను కాపాడేందుకు వీలుగా బస్సు ఛార్జీలను పెంచాలని  సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు. ఈ నిర్ణయానికి అనుగుణంగా ఆర్టీసీ యాజమాన్యం సోమవారం అర్ధరాత్రి నుండి బస్సు ఛార్జీలను పెంచనుంది.

పల్లెవెల్లుగు బస్సుకు కనీస ఛార్జీ కి.మీ.కు 63 పైసల నుండి 83 పైసలకు పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు. పల్లె వెలుగు బస్సు కనీస ఛార్జీని రూ.10 లుగా నిర్ణయించారు. ఇక సెమీ ఎక్స్‌ప్రెస్ బస్సుకు కిలోమీటరు చార్జీని 75 పైసల నుండి 95 పైసలకు పెంచారు. ఈ బస్సుకు కూడ కనీస ఛార్జీ రూ. 10లుగా నిర్ణయించారు.

ఎక్స్‌ప్రెస్ బస్సు చార్జీని కిలోమీటరుకు 87 పైసల నుండి రూ. 1.07 పైసలకు పెంచారు.ఎక్స్‌ప్రెస్ బస్సు కనీస చార్జీ రూ. 20లకు పెరగనుంది. ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్ బస్ ఛార్జీ రూ. 15లు మాత్రమే.

ఇక డీలక్స్ బస్సులకు కిలోమీటరుకు 98 పైసలను వసూలు చేయనున్నారు. దీన్ని 118 పైసలకు పెంచారు డీలక్స్ బస్సుల కనీస ఛార్జీని రూ. 25 లకు పెంచారు. సూపర్ లగ్జరీ బస్సులకు కిలోమీటరుకు 116 పైసల నుండి 136 పైసలకు పెంచారు.  ప్రస్తుతం సూపర్ లగ్జరీ బస్సుల కనీస ఛార్జీని రూ. 25లుగా ఉంది. దీన్ని రూ. 30లుగా పెంచారు.

రాజధాని ఏసీ, వజ్ర ఏసీ బస్సుల్లో కిలోమీటరకు 146పైసల నుండి 166 పైసలకు పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు. ప్రస్తుతం ఈ బస్సుల్లో రూ.35 రూపాయాలను కనీస ఛార్జీగా ఉంది. కానీ, దీన్ని  రూ. 45లకు పెంచారు.

గరుడ ఏసీ బస్సుల్లో కిలోమీటరకు 171 పైసల చొప్పున ఉన్న కనీస చార్జీని 191 పైసలకు పెంచారు.  ఈ బస్సుల కనీస ఛార్జీ రూ. 45లకు పెరిగింది.

వెన్నెల ఏసీ బస్సులకు కిలోమీటరుకు 253 పైసల నుండి 273 పైసలకు చార్జీలను పెంచారు. ఈ బస్సుల కనీస ఛార్జీ రూ. 80లకు పెంచారు. ప్రస్తుతం ఈ బస్సు కనీస ఛార్జీ రూ.70లు మాత్రమే.

Also read:ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ వరాలు: రిటైర్మెంట్ వయస్సు 60 ఏళ్లకు పెంపు

ఇక బస్సుపాసుల ఛార్జీలు కూడ పెరిగాయి. సిటీ ఆర్డినరీ బస్ పాస్ చార్జీలు రూ. 770 నుండి రూ. 950కు పెంచారు. మెట్రోపాస్ ధరను రూ.రూ. 880 నుండి రూ. 1070 కు పెంచారు. మెట్రో డీలక్స్ పాస్ ధర రూ. 990 నుండి రూ. 1180 కు పెంచారు. స్టూడెంట్స్ బస్ పాస్ ధరలు రూ. 130 నుండి రూ. 165కు పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు.

click me!