మరోసారి తెలంగాణ సర్కార్ చర్చలు: హెల్త్ సెక్రటరీతో జూడాల భేటీ

By narsimha lodeFirst Published May 27, 2021, 12:30 PM IST
Highlights

జూనియర్ డాక్టర్లను తెలంగాణ ప్రభుత్వం మరోసారి చర్చలకు పిలిచింది. బుధవారం నాడు ప్రభుత్వంతో నిర్వహించిన చర్చలు విఫలం కావడంతో గురువారం నాడు మరోసారి ప్రభుత్వంతో జూడాలు చర్చించనున్నారు.

హైదరాబాద్: జూనియర్ డాక్టర్లను తెలంగాణ ప్రభుత్వం మరోసారి చర్చలకు పిలిచింది. బుధవారం నాడు ప్రభుత్వంతో నిర్వహించిన చర్చలు విఫలం కావడంతో గురువారం నాడు మరోసారి ప్రభుత్వంతో జూడాలు చర్చించనున్నారు.తెలంగాణ హెల్త్ సెక్రటరీ రిజ్వీ పిలుపు మేరకు జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ తరపున ప్రతినిధులు ఇవాళ  చర్చల్లో పాల్గొన్నారు. కరోనా రోగులకు చికిత్స చేస్తూ మృతి చెందే వైద్య ఆరోగ్య సిబ్బందికి పరిహారం చెల్లింపు విషయంతో పాటు  నిమ్స్ లో వైద్య ఆరోగ్య సిబ్బంది కుటుంబసభ్యులకు చికిత్స అందించాలని జూడాలు పట్టుబడుతున్నారు. 

also read:చర్చలు విఫలం: లిఖిత పూర్వక హామీ ఇవ్వాల్సిందే.. అప్పుడే విధుల్లోకి, తేల్చి చెప్పిన జూడాలు

ఈ విషయమై ప్రభుత్వం నుండి స్పష్టత వస్తే తాము తిరిగి విధుల్లో చేరుతామని జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే సమ్మె చేస్తామని ఈ నెల 10వ తేదీనే డీఎంఈకి జూడాలు నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందన రాకపోవడంతో జూడాలు సమ్మెకు దిగారు. ఇవాళ్టి నుండి అత్యవసర సేవలను కూడ జూడాలు బహిష్కరించారు. ఈ సమయంలో జూనియర్ డాక్టర్లు సమ్మెుక దిగడం సరైందికాదని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. జూడాల తీరుపై ఆయన  బుధవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జూడాలకు, సీనియర్ రెసిడెంట్లకు  15 శాతం స్టైఫండ్ ను పెంచుతూ తెలంగాణ సీఎం నిర్ణయం తీసుకొన్నారు.తమ డిమాండ్ల విషయంలో డీఎంఈ నుండి తమకు సానుకూలంగా స్పందన రాలేదని జూడాల ప్రతినిధులు మీడియాకు తెలిపారు. తమ డిమాండ్ల విషయంలో ప్రభుత్వం నుండి స్పష్టత వస్తే  విధుల్లో చేరుతామని జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. 

click me!