విషాదం : తండ్రికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు.. తనతో కాదంటూ వదిలేసి వెళ్లిన కొడుకు..

Published : May 27, 2021, 12:17 PM IST
విషాదం : తండ్రికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు.. తనతో కాదంటూ వదిలేసి వెళ్లిన కొడుకు..

సారాంశం

వికారాబాద్ జిల్లా పరిగిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. తండ్రికి బ్లాక్ ఫంగస్ లక్షణాలుండడంతో ఓ కన్నకొడుకు అమానుషంగా వదిలేసి వెళ్లిపోయాడు. 

వికారాబాద్ జిల్లా పరిగిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. తండ్రికి బ్లాక్ ఫంగస్ లక్షణాలుండడంతో ఓ కన్నకొడుకు అమానుషంగా వదిలేసి వెళ్లిపోయాడు. 

రుక్కుంపల్లికి చెందిన చంద్రయ్య (63)కు ఈ నెల మూడున కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. కాగా తాండూరు జిల్లా ఆసుపత్రిలో చంద్రయ్య చికిత్స పొందాడు. కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత చంద్రయ్యకు నిన్నబ్లాక్ ఫంగస్ లక్షణాలు  బయటపడ్డాయి. 

చంద్రయ్య కన్ను, నుదుటి భాగంలో వాపు,ఇన్ఫేక్షన్ రావడంతో అవి బ్లాక్ ఫంగస్ లక్షణాలే అని తేలడంతో.. ఇక నా వల్ల కాదంటూ కొడుకు వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో చేసేదేం లేక చంద్రయ్య పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో పడిగాపులు కాస్తున్నాడు.  

డాక్టర్లు చంద్రయ్యను మహవీర్ ఆసుపత్రికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కరోనా ఎంతటి దారుణాలను చేపిస్తుందో ఈ ఘటన తెలుపుతుంది. ఆస్పత్రులు వసూలు చేస్తున్న అధిక బిల్లులు, చికిత్స ఖరీధు కావడంతో ఏమీ చేయలేని నిస్సహాతలో పేగు బంధాలను, మానవత్వాన్ని మరిచిపోయే ఇలాంటి ఘటనలు అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి. 

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్