కేసీఆర్ కుటుంబానికి ఉద్యమానికి ముందు ఆస్తులెన్ని?.. వాటిలో కేటీఆర్‌కు వాటా: జీవితా రాజశేఖర్ సంచలన కామెంట్స్

Published : Aug 24, 2022, 01:47 PM IST
కేసీఆర్ కుటుంబానికి ఉద్యమానికి ముందు ఆస్తులెన్ని?.. వాటిలో కేటీఆర్‌కు వాటా: జీవితా రాజశేఖర్ సంచలన కామెంట్స్

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై బీజేపీ నాయకురాలు, ప్రముఖ నటి జీవితా రాజశేఖర్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ఉద్యమానికి ముందు కేసీఆర్ కుటుంబం ఆస్తులు ఎంతని?.. ఇప్పుడేంతని ప్రశ్నించారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై బీజేపీ నాయకురాలు, ప్రముఖ నటి జీవితా రాజశేఖర్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ఉద్యమానికి ముందు కేసీఆర్ కుటుంబం ఆస్తులు ఎంతని?.. ఇప్పుడేంతని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబానికి ఇన్ని కోట్ల ఆస్తులు  ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. క్లబ్‌, పబ్‌లు అన్నింటిలో కేటీఆర్‌కు వాటా ఉందని ఆరోపించారు. ఈ విషయాన్ని చాలామంది యజమానులు తనతో చెప్పినట్లు జీవిత పేర్కొన్నారు. అక్రమ అరెస్టులు, దాడులు, నిర్బంధాలపై బీజేపీ నేడు తెలంగాణ వ్యాప్తంగా నిరసన దీక్షకు దిగింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన దీక్షలో జీవితా రాజశేఖర్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా జీవిత మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ చేయడం కరెక్టేనా ప్రశ్నించారు. తెలంగాణలో డిక్టేటర్ పాలన సాగుతుందని ఆరోపించారు. ధైర్యం ఉంటే టీఆర్ఎస్ నేతలు పాదయాత్ర చేయాలని డిమాండ్ చేశారు. లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత తప్పు చేయనప్పుడు నిజమేమిటో ధైర్యంగా చెప్పాలని అన్నారు. మునుగోడులో టీఆర్ఎస్‌కు భారీ షాక్ తప్పదని అన్నారు. టీఆర్ఎస్ ప్రజలు పిచ్చివాళ్లను చేయలనుకుంటే.. వాళ్లే రోజురోజుకు పిచ్చివాళ్లు అయిపోతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్‌ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే.. బండి సంజయ్‌ వెంటనే విడుదల చేసి, పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని సవాలు చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Harish Rao Aarogyasri Speech:ఆరోగ్యశ్రీ బిల్లులపై పై హరీష్ రావు కీలక కామెంట్స్ | Asianet News Telugu
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం: Revanth Reddy Powerful Speech in Assembly: | Asianet Telugu