
నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద మరోసారి తెలుగు రాష్ట్రాల పోలీసుల మధ్య వివాదం చోటుచేసుకుంది. డ్యామ్‌పై రాకపోకల విషయం ఏపీ సివిల్ పోలీసులు, తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసుల మధ్యకు వాగ్వాదం జరిగింది. అయితే నాగార్జున సాగర్ డ్యామ్ పై జరిగిన గొడవ ఓ ఎస్సై పూర్తి వ్యక్తిగత వ్యవహారంగా తెలుస్తోంది. ఏపీకి చెందిన విజయపురి కాలనీ ఎస్సై అనిల్ కుమార్ రెడ్డి అత్యుత్సాహం తో ఇరు రాష్ట్రాల గోడవగా చిత్రీకరణించినట్టుగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనిల్ కుమార్ రెడ్డి అధికార పనుల కంటే వ్యక్తిగత పనుల మీదనే డ్యామ్‌పై అటు ఇటు తిరుగుతాడనే ఆరోపణలు ఉన్నాయి.
అయితే అనధికారికంగా తిరగడంతో ఇలా రావడం కరెక్ట్ కాదని అనిల్ కుమార్ రెడ్డికి తెలంగాణ పోలీసులు సూచించారు. దీంతో వారిపై అనిల్ కుమార్ రెడ్డి కక్షసాధింపు చర్యలకు దిగారాు. అందులో భాగంగానే డ్యూటీకి వెళ్తున్న తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసులకు చాలన్‌లు వేసి వేధించిచారు. దీంతో అనిల్ కుమార్ రెడ్డి అనధికారికంగా డ్యామ్‌పైకి రావడాన్ని తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసులు అడ్డుకున్నారు. అయితే తనను ఇలా అడ్డుకోవడాన్ని అనిల్ కుమార్ రెడ్డి పూర్తిగా రెండు రాష్ట్రాల పంచాయితీ గా చిత్రీకరించారు. ప్రస్తుతం సదరు ఎస్సైపై పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్టు సమాచారం.