తెలియక ఇరుక్కున్న నటుడు సూర్య: సినీతారలతో రాకేష్ రెడ్డికి లింక్స్

By telugu teamFirst Published Feb 16, 2019, 3:32 PM IST
Highlights

సూర్యప్రసాద్‌ కలియుగ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. దాని నిర్మాణం కోసం రూ.25 లక్షలు అప్పు ఇవ్వాలని కొద్ది నెలలుగా రాకేష్‌రెడ్డిని కోరుతున్నట్లు సమాచారం.ఆడియో విడుదలకు సమయం సమీపిస్తుందంటూ సూర్య ఒత్తిడి చేశాడు. చివరకు జనవరి నెలాఖరులో ఇస్తానని రాకేష్ రెడ్డి హామీ ఇచ్చాడని అంటున్నారు.

హైదరాబాద్: ఎన్నారై పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో నటుడు సూర్యప్రసాద్ తెలియక ఇరుక్కున్నట్లు భావిస్తున్నారు.  సూర్యప్రసాద్‌ కలియుగ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. దాని నిర్మాణం కోసం రూ.25 లక్షలు అప్పు ఇవ్వాలని కొద్ది నెలలుగా రాకేష్‌రెడ్డిని కోరుతున్నట్లు సమాచారం. 


ఆడియో విడుదలకు సమయం సమీపిస్తుందంటూ సూర్య ఒత్తిడి చేశాడు. చివరకు జనవరి నెలాఖరులో ఇస్తానని రాకేష్ రెడ్డి హామీ ఇచ్చాడని అంటున్నారు. జనవరి 30వ తేదీన సూర్యకు రాకేష్‌రెడ్డి ఫోన్‌ చేశాడని, తన స్నేహితుడు జయరాంను కారులో ఇంటికి తీసుకొస్తే సొమ్ము ఇస్తానని నమ్మించాడని అంటున్నారు. 

అందుకు అంగీకరించిన అతను తన కారులో స్నేహితుడు కిషోర్‌తో కలిసి రాకేష్‌రెడ్డి ఇంటికి వెళ్లాడని, తర్వాత ముగ్గురూ అదే కారులో జూబ్లీహిల్స్‌ క్లబ్‌ సమీపంలోకి చేరుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత రాకేష్‌ రెడ్డి  ... తన స్నేహితుడు కిషోర్‌ వస్తాడని, అతని కారులో రావాలని వీణ పేరుతో జయరాంకు మెసేజ్ పంపినట్లు తెలుస్తోంది. 

జయరాం జూబ్లీహిల్స్‌ క్లబ్‌ వద్దకు వచ్చిన తర్వాత కిషోర్‌ అతని కారులో ఎక్కి రాకేష్‌రెడ్డి ఇంటికి తీసుకొచ్చాడని,  దానికి ముందే సూర్యప్రసాద్‌, రాకేష్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారని, తర్వాత అందర్నీ బయటికి పంపించిన ప్రధాన నిందితుడు.. జయరాంను ఇంట్లో బంధించాడని పోలీసు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. 

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 10లో డూప్లెక్స్‌ ఇంటిని రాకేష్‌రెడ్డి నెలకు రూ.1.5 లక్షలు అద్దెకు తీసుకున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. రాకేష్‌రెడ్డి ఇంటికి వారాంతాల్లో పలువురు రియల్టర్లు, దందాల్లో అండగా నిలిచేవారని, పలువురు పోలీసు అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు అతని ఇంట్లో ఇచ్చే విందు, వినోదాలకు హాజరయ్యేవారని తెలుస్తోంది. 

కొందరు సినీతారలు కూడా వచ్చేవారని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. తెలుగు, కన్నడ చిత్రాల్లో నటిస్తున్న ఓ నటి తరచూ వచ్చి వెళ్లేదనే సమాచారాన్ని పోలీసులు సేకరించారని వార్తలు వచ్చాయి.

సంబంధిత వార్తలు

జయరాం హత్య: సిరిసిల్ల కౌన్సిలర్ భర్తను విచారిస్తున్న పోలీసులు

జయరాం హత్య: పోలీస్ విచారణ తర్వాత మీడియాతో శిఖా చౌదరి (వీడియో)

జయరామ్ హత్య: నటుడు సూర్యతో హానీట్రాప్

జయరామ్ హత్యలో నగేష్ పాత్ర: ఖాళీ బాండ్‌ పేపర్లపై సంతకాలు

జయరామ్ హత్య కేసు: ఏసీపీ ఆఫీసులో శిఖా చౌదరి విచారణ

జయరామ్ హత్య: అప్పు ఉత్తి మాటే, బలవంతపు వసూలుకే

జయరామ్ హత్య: జూ.ఆర్టిస్ట్ సహా మరో 9 మంది పోలీసుల పాత్రపై ఆరా

జయరామ్ మృతదేహంతో హైద్రాబాద్‌లో రాకేష్ రెడ్డి చక్కర్లు

జయరామ్ హత్య కేసు: జూబ్లీహిల్స్‌కు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి

click me!