సిద్దిపేటలో చీరల కోసం ఎగబడ్డ మహిళలు...10 మందికి గాయాలు

By Arun Kumar PFirst Published Feb 16, 2019, 1:31 PM IST
Highlights

సిద్దిపేట పట్టణంలోని ఓ షాపింగ్ మాల్ ప్రచారం గందరగోళానికి కారణమయ్యింది. అత్యంత తక్కువ ధరకే చీరలు  అందిస్తున్నారని ప్రచారం జరగడంతో షాపింగ్ మాల్ వద్దకు భారీగా మహిళలు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఈ క్రమంలో మహిళలు షాపింగ్ మాల్ లోపలికి వెళ్ళడానికి పోటీ పడటంతో తొక్కిసలాట జరిగింది. 

సిద్దిపేట పట్టణంలోని ఓ షాపింగ్ మాల్ ప్రచారం గందరగోళానికి కారణమయ్యింది. అత్యంత తక్కువ ధరకే చీరలు  అదిస్తున్నారని ప్రచారం జరగడంతో షాపింగ్ మాల్ వద్దకు భారీగా మహిళలు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఈ క్రమంలో మహిళలు షాపింగ్ మాల్ లోపలికి వెళ్ళడానికి పోటీ పడటంతో తొక్కిసలాట జరిగింది. 

ఈ ఘటన సిద్దిపేటలోని సీఎంఆర్ షాపింగ్ మాల్ వద్ద చోటుచేసుకుంది. ఇవాళ ఈ షాపింగ్ మాల్ కేవలం రూ.10 కే చీరలను అమ్మకానికి పెట్టినట్లు పట్టణంలో జోరుగా ప్రచారం జరిగింది. దీంతో పట్టణం నుండే కాదు పక్క గ్రామాల నుండి కూడా భారీ సంఖ్యలో మహిళలు షాపింగ్ మాల్ వద్దకు చేరుకున్నారు. దీంతో షాప్ వద్ద రద్దీ పెరిగి తొక్కిసలాటకు దారి తీసింది. ఈ తొక్కిసలాటలో 10 మంది  మహిళలకు గాయాలయ్యాయి. 

దీనిపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సదరు షాపింగ్ మాల్ వద్దకు చేరుకుని రద్దీని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం పరిస్ధితి అదుపులోకి  వచ్చినట్లు పోలీసులు తెలిపారు. 

click me!