ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీల ఆత్మగౌరవ సభ .. హాజరుకానున్న మోడీ, వేదికపై సంజయ్, అర్వింద్‌లతో పవన్ ముచ్చట్లు

By Siva Kodati  |  First Published Nov 7, 2023, 5:40 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీతో జనసేన పార్టీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే . హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీసీల ఆత్మగౌరవ సభ నిర్వహిస్తోంది బీజేపీ. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానుండగా.. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ వేదిక మీదకు చేరుకున్నారు.


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీతో జనసేన పార్టీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. జనసేనకు 8 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ పెద్దలు ఓకే చెప్పారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీసీల ఆత్మగౌరవ సభ నిర్వహిస్తోంది బీజేపీ. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానుండగా.. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ వేదిక మీదకు చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్‌లతో కలిసి ఆయన నవ్వులు చిందిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు 9 ఏళ్ల తర్వాత ప్రధాని మోడీతో పవన్ కల్యాణ్ వేదికను పంచుకుంటూ వుండటంతో.. ఆయన ఏం మాట్లాడతారా అని రెండు రాష్ట్రాల ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

ఈ బహిరంగ సభకు హాజరుకావాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి తనను ఆహ్వానించారనీ, ఆ ఆహ్వానాన్ని అంగీకరించానని జ‌న‌సేన అధినేత తెలిపారు. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ)తో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు తమతో జతకట్టాలన్న ఆయన ప్రతిపాదనపై బీజేపీ ఇంకా స్పందించలేదు. 2014లో రాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి పవన్ క‌ళ్యాణ్ మద్దతు పలికారు. జ‌న‌సేన ఎన్నికలలో పోటీ చేయలేదు కానీ ప‌వ‌న్ కూటమి కోసం ప్రచారం చేసారు. మోడీ-టీడీపీ నాయ‌కుడు ఎన్ చంద్ర‌బాబు నాయుడుతో కలిసి కొన్ని బహిరంగ సభలలో ప్రసంగించారు.

Latest Videos

2014లో రాష్ట్ర విభజన సమయంలో కట్టుబడి ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక కేటగిరీ హోదా ఇవ్వనందుకు జ‌న‌సేన పార్టీ బీజేపీ, తెలుగుదేశం పార్టీలతో విడిపోయింది. 2019లో,జ‌న‌సేన‌, వామపక్ష పార్టీలు, బహుజన్ సమాజ్ పార్టీ (BSP)తో పొత్తులు పెట్టుకుని ఎన్నిక‌ల బ‌రిలో నిలిచింది. అయితే, 175 మంది సభ్యుల అసెంబ్లీలో ఆ పార్టీ కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. ఇక పవన్ కళ్యాణ్‌ తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయారు.
 

click me!