కేసీఆర్ కు కరోనా... తెలంగాణ ప్రజలందరికీ అదే ఊరట: పవన్ కల్యాణ్

Arun Kumar P   | Asianet News
Published : Apr 20, 2021, 12:38 PM ISTUpdated : Apr 20, 2021, 12:43 PM IST
కేసీఆర్ కు కరోనా... తెలంగాణ ప్రజలందరికీ అదే ఊరట: పవన్ కల్యాణ్

సారాంశం

 సీఎం కె. చంద్రశేఖర రావుకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలిసిందని... వారు సత్వరమే కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాంటూ పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు. 

హైదరాబాద్: తాను కూడా కరోనాతో బాధపడుతున్నప్పటికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో  పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి కరోనా అని తెలియడంతో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్పందించారు.  సీఎం కె. చంద్రశేఖర రావుకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలిసిందని... వారు సత్వరమే కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాంటూ పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు. 

''కె.సి.ఆర్ సంపూర్ణ ఆరోగ్యవంతులై ఎప్పటిలాగే ప్రజా సేవలో నిమగ్నం కావాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాను. వారికి కోవిడ్ స్వల్ప లక్షణాలే ఉన్నాయనీ... ఎలాంటి ఇబ్బందీ లేదని వైద్యులు చెప్పడం తెలంగాణ ప్రజలందరికీ ఊరటను కలిగిస్తుంది'' అని పవన్ అన్నారు. 

''మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కరోనాతో ఎయిమ్స్ లో చేరినట్లు సమాచారం అందింది. ఒక ఆర్థికవేత్తగా, దేశ ప్రధానిగా ఎన్నో సేవలు అందించిన మన్మోహన్ సింగ్  ఈ వ్యాధి నుంచి బయటపడి ఆరోగ్యవంతులు కావాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాను'' అని తన ప్రకటనలో పేర్కొన్నారు పవన్ కల్యాణ్. 

read more   కరోనా ఎఫెక్ట్: నేటి నుండి తెలంగాణలో నైట్ కర్ఫ్యూ, వీటికి మినహాయింపు

ఆదివారం సీఎం కేసీఆర్ కి కరోనా పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ గా వచ్చినట్లు తేలింది. స్వల్ప జ్వరం, ఒళ్లు నొప్పులు ఉన్నాయని.. కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు తెలిపారు. యాంటిజెన్ టెస్టు చేయగా కరోనా సోకినట్లు తేలిందన్నారు. ప్రస్తుతం కేసీఆర్ హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. ఆయన కుటుంబ సభ్యులు వ్యక్తిగత సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

కేసీఆర్ కి కరోనా రావడం పై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు స్పందించారు. కేసీఆర్.. ఈ కరోనా మహహ్మారి నుంచి త్వరగా కోలుకోవాలని ఆంకాంక్షించారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు. గెట్ వెల్ సూన్ అని చంద్రబాబు ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.  

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్ లోనే కోల్డెస్ట్ 48 గంటలు.. ఈ ప్రాంతాల్లో చలిగాలుల అల్లకల్లోలమే
Medak Cathedral – Asia’s 2nd Largest Gothic Church Near Hyderabad | Story | Asianet News Telugu