మల్లాపూర్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం: భయంతో పరుగులు తీసిన కార్మికులు

Published : Apr 20, 2021, 11:20 AM ISTUpdated : Apr 20, 2021, 11:27 AM IST
మల్లాపూర్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం: భయంతో పరుగులు తీసిన కార్మికులు

సారాంశం

 జిల్లాలోని మల్లాపూర్ పారిశ్రామకవాడలో  ని ఓ కుర్చీల తయారీ పరిశ్రమలో మంగళవారం నాడు అగ్నిప్రమాదం చోటు చేసుకొంది. స్థానికులు  అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇ,చ్చారు.

మేడ్చల్: జిల్లాలోని మల్లాపూర్ పారిశ్రామకవాడలో  ని ఓ కుర్చీల తయారీ పరిశ్రమలో మంగళవారం నాడు అగ్నిప్రమాదం చోటు చేసుకొంది. స్థానికులు  అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇ,చ్చారు.కుర్చీల తయారీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం కారణంగా  పక్కనే ఉన్న ఫ్యాక్టరీలోకి మంటలు వ్యాపించాయి.  దీంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. భారీగా మంటలు వెలువడడంతో  మంటలను ఆర్పేందుకు  స్థానికులు ప్రయత్నిస్తున్నారు.  ఫైరింజన్లు  సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నాయి. 

గతంలో కూడ హైద్రాబాద్ శివార్లలోని పలు పారిశ్రామిక వాడల్లో అగ్ని ప్రమాదాలు జరిగాయి. చాలా ఫ్యాక్టరీల్లో  ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోవడం లేదనే విమర్శలు కూడ ఉన్నాయి.  ఫైర్ సేఫ్టీ  జాగ్రత్తలు తీసుకోని  ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఉంది. అయితే  ఇలాంటి ప్రమాదాలు జరిగిన సమయంలో  హడావుడి చేసి ఆ తర్వాత  చూసీ చూడనట్టుగా వదిలేస్తున్నారనే విమర్శలు కూడ నెలకొన్నాయి.
 

PREV
click me!

Recommended Stories

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలతో హై అలర్ట్.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్
తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక రానున్న 24 గంటల్లో | Heavy Rain Alert for AP & Telangana