
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై నల్లగొండ లో జరిగిన దాడి హేయమైన చర్య అని ఆ పార్టీ సీనియర్ నేతలు పేర్కొన్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ రౌడీయిజానికి తాము భయపడేదేలేదని స్పష్టం చేశారు.
నల్గొండ ఘటనపై జ్యూడీషిల్ విచారణ జరపాలని . పోలీసులు పక్షపాత వైఖరిపైనా విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
టీపీసీసీ సమావేశం అనంతరం పార్టీ సీనియర్ నేత జానా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నల్లగొండ ఘటనతో టీఆర్ఎస్ బరితెగింపు ఏ స్థాయిలో ఉందో బయటపడిందని అన్నారు. సదుద్దేశంతో తమ ఎమ్మెల్యే బత్తాయి మార్కెట్ ప్రారంభోత్సవానికి వెళ్తే పక్కా ప్లాన్ తోనే అధికార పార్టీ గుండాలు ఆయనపై రాళ్లదాడి చేశారని ఆరోపించారు.
ప్రభుత్వ కార్యక్రమానికి టీఆర్ఎస్ కార్యకర్తలను ఎందుకు పిలిచారో చెప్పాలని డిమాండ్ చేశారు.దాడి ఘటనలో పోలీసులు అధికార పార్టీ కార్యకర్తలుగా వ్యహరించారని విమర్శించారు. పరిస్థితి ఇలాగే ఉంటే ప్రజలే ప్రభుత్వాన్ని నడవకుండా చేస్తారని హెచ్చరించారు.
తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజినామ చేసిన కోమటిరెడ్డిపై దాడి చేయటం క్రూరమైన చర్యగా అభివర్ణించారు. దాడి ఘటనలో ఒక్క తెరాస కార్యకర్తపైనా కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.
రైతులకు బేడీలు వేసి తీసుకెల్లటం అసహ్యమైనది. పక్క రాష్ట్రాలు రైతుల కు సబ్సిడి ఇస్తుంటే. మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదన్నారు.
టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది కేసీఆర్ రాజ్యమో... జాగీరు కాదు. పోలీసులతో అణిచివేయాలని చూస్తే.. సహించం..దేనికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. నల్గొండ ఘటన ను స్పీకర్ సుమోటోగా తీసుకోవాలన్నారు.
నల్గొండలో రౌడీ ఇజం ఎక్కువగా ఉందని. మాజీ మావోయిస్తులే ఎమ్మెల్యేలు గా ఉన్నారు ఎమ్మేల్యే కోమటి రెడ్డి పేర్కొన్నారు. మంత్రి హరీష్ ఆహ్వానించినందువల్లే తాను కార్యక్రమానికి వెళ్లినట్లు తెలిపారు. అయితే అక్కడున్న పోలీసులు నన్ను ఒక్కడినే రమ్మనడం ఆశ్యర్యం కల్గించిందని ప్లాన్ ప్రకారమే నా పై దాడి జరిగిందని తెలిపారు.