టీఆర్ఎస్ కారు తో యూపీ పాత బైకులు పోటీ పడ్తాయా ?

Published : May 18, 2017, 03:53 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
టీఆర్ఎస్ కారు తో యూపీ పాత బైకులు పోటీ పడ్తాయా ?

సారాంశం

తెలంగాణకు తరలించిన ఈ బైక్ లన్నీ ప్రభుత్వం నిషేధించిన బీఎస్ 3 మోడల్ వే కావడం గమనార్హం.

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత గులాబీమయమైన తెలంగాణకు కాషాయరంగును అద్దే పనిలో బీజేపీ నేతలు బీజీగా ఉన్నారు.

 

ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే పక్కా ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. అందులో భాగమే భారత ప్రభుత్వం నిషేధించిన బీఎస్ 3 వాహనాలను తెలంగాణకు పంపడం.

 

ఉత్తరప్రదేశ్ నుంచి దిగుమతి చేసిన పాత బైక్ లతో తెలంగాణ లో అధికార కారును ఓడించాలని బీజేపీ అధినేత అమిత్ షా నిర్ణయించుకున్నారట.

 

అందుకే మోదీ నియోజక వర్గం  వారణాసిలోని  ఆర్టీఓలో రిజిస్ట్రేషన్‌ చేయించిన బైక్ లను తెలంగాణకు పంపించారు.

 

తెలంగాణ నేతల ను నమ్ముకునే బదలు ఢిల్లీ నుంచే కారుకు చెక్ పెట్టాలని అధినాయకత్వం భావిస్తుందట. అందుకే అక్కడి నుంచి నేతలనే కాకుండా ఇప్పుడు బైక్ లను కూడా పంపిస్తుందట.

 

ఈ బైక్ లను ఇక్కడ పార్టీ కార్యకర్తలకు అందించి వారితోనే రోజూ టచ్ లో ఉండేలా ఢిల్లీ పెద్దలు ఓ మాస్టర్ ప్లాన్ ఆలోచించారు.

 

ఇందులో భాగంగా ఓ 100 మంది కార్యకర్తలను కూడా తయారు చేసుకున్నారు. వీరందరికీ ఇప్పటికే శిక్షణ కూడా ఇచ్చారు.

 

ఈనెల 22 నుంచి మూడు రోజుల పాటు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా

 

రాష్ట్రంలో పర్యటించనున్నారు. అప్పడే ఎంపిక చేసిన కార్యకర్తలకు ఈ బైక్ లను నజరానాగా అందజేస్తారు. బైకుల్ని అందుకున్న వారు ఫుల్‌టైమ్‌ కార్యకర్తలుగా పనిచేస్తూ డైరెక్టుగా ఢిల్లీ పెద్దలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలట.

 

అయితే యూపీ నుంచే ఎందుకు బైక్ లను తెప్పించినట్లు తెలంగాణ లో బైక్ లు లేవా అని ఆలోచిస్తే మరో ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది.

 

బైక్ రిజిస్ట్రేష న్‌ ను గమనిస్తే అది నరేంద్రమోడీ పార్లమెంటు నియోజకవర్గంలోని వారణాసి ఆర్టీఓలో నమోదైఉన్నట్టు తేలింది.

 

అంతేకాదు తెలంగాణకు తరలించిన ఈ బైక్ లన్నీ ప్రభుత్వం నిషేధించిన బీఎస్ 3 మోడల్ వే కావడం గమనార్హం. ఈ వాహనాల రద్దుకు ఒక్క రోజు ముందే వీటిని అక్కడి బీజేపీ నాయకత్వం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

 

అయితే ఒక్క తెలంగాణకేనా లేక అన్ని రాష్ట్రాలకు వారణాసి నుంచి ఈ బైక్ ల తరలింపు మొదలైందా అనేది ఇంకా తెలియరాలేదు.

 

ప్రస్తుతం నాపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భద్రంగా దాచిఉంచిన ఈ బైక్ ల గురంచి అడిగితే రాష్ట్ర నేతలు నోరు మెదపడం లేదు. అంతా ఢిల్లీ నాయత్వమే చూసుకుంటుంది. బైక్ ల వ్యవహారం గురించి వారే చెబుతారని దాటవేస్తున్నారు.

 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?