కెసిఆర్, అమిత్ షా లది లాలూచీ కుస్తీ

Published : May 25, 2017, 02:35 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
కెసిఆర్, అమిత్ షా లది లాలూచీ కుస్తీ

సారాంశం

కెసిఆర్ అమిత్ షా ని తిట్టడం బిజెపి-టిఆర్ ఎస్ లాలూచి కుస్తీలో భాగమే. బిజెపి ఒక పాము. దాని పడగ ప్రధాని మోదీ. కెసిఆర్ కు మోదీ మిత్రుడయినపుడు అమిత్ షా శత్రువెలా అవుతాడు. కెసిఆర్, అమిత్ షా తిట్టుకోవడం లాలూచి కుస్తీ. ఈ రెండు పార్టీలతో విబేధించేవారందరితో కాంగ్రెస్ చేతులు కలుపుతుంది: జైపాల్ రెడ్డి

ముఖ్యమంత్రి కెసిఆర్ లాగే మాటల యోధుడు మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి  ఈ రోజు కెసిఆర్-అమిత్ షా తగాదా గురించి చాలా అసక్తికరమయిన వ్యాఖ్యలు చేశారు.

అమిత్ షా చెప్పిన కాకిలెక్కలు, కెసిఆర్ అమిత్ షా మీద నిప్పులు చిమ్మడం అంతా బూటకం అన్నారు.

ఇదంతా ‘బిజెపి-టిఆర్ ఎస్ లాలూచి కుస్తీ’ లో భాగమే అని చెప్పారు.

 

అమిత్ షా ప్రధాని మోదీ మనిషి, ప్రధాని మోదీ తనకు స్నేహితుడని కెసిఆర్ చెబుతాారు. మరి ప్రధాని మనిషితో కెసిఆర్ తగవెలాపడతారు. ఇదంతా లాలూ చి కుస్తీ అని జైపాల్ రెడ్డి కొట్టేి పడేశారు. .మోడీతో స్నేహమేమిటి, అమిత్ షా తో శతృత్వమేమిటి టని ప్రశ్నించారు.

 

‘బిజెపి ఒక పాము లాంటిది. దాని పడగ ప్రధాని మోదీ. కెసిఆర్ కు మోదీ మిత్రుడయినపుడు అమిత్ షా శత్రువెలా అవుతాడు. కెసిఆర్, అమిత్ షా తిట్టుకోవడం వూరికే. ఎందుకంటే .మోడీతో కేసిఆర్ కు రహస్యంగా మిలాఖత్ అయ్యారు. కెసిఆర్ సిద్ధాంత వాదికాదు, రాద్ధాంత వాది. అమిత్ షాతో రాద్ధాంతం ఇదే,’ అని  జైపాల్ రెడ్డి  ఒక టివితో మాట్లాడుతూ అన్నారు.

 

కాకపోతే, బిజెపి అంటే కెసిఆర్ కు కొంత భయమున్న మాట వాస్తవమని చెప్పారు. దీనికి కారణం కెసిఆర్ అవినీతిలెక్కలన్నీ బిజెపి దగ్గిర ఉన్నాయని అందుకే ఈ భయం అన్నారు.

.

భవిష్యత్ లో బిజెపితో టీఆరెస్ కలుస్తుందని అన్నారు.

 

ఎలా కలుస్తుందో అడిగినపుడు, ‘ రెండు పార్టీలు కలవడం రకరకాలుగా ఉంటుంది. ఎన్నికల ముందు పొత్తు పెట్టుకోవచ్చు లేదా ఎన్నికల తర్వాత చేతులు కలపవచ్చు. లేదా లోపాయకారి ఒప్పందం పెట్టుకోవచ్చు.  పైకి తలపడినట్లు లోన చేతులు కలపినట్లు ఉండవచ్చు,’ అని చెప్పారు.

 

కాంగ్రెస్ విధానం గురించి మాట్లాడుతూ  టిఆర్ ఎస్, బిజెపితో సంబంధం లేని ఏ పార్టీతోనైనా కాంగ్రెస్ చేతులు కలుపుతుందని చెప్పారు  .2019 ఎన్నికల్లో టీఆరెస-బిజెపిలను కాంగ్రెస్ ఎదుర్కొంటుందని చెప్పారు.

 

కెసీఆర్ వి ఉత్తర కుమార్ ప్రతిజ్ఞలేనని జైపాల్ రెడ్డి అభివర్ణించారు..దోఖా , అబద్దాలు చెప్పడమే కేసీఆర్  నైజమని విమర్శించారు.

 

 

 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?