చంద్రబాబు సాక్షిగా ఈ ‘ఎన్టీయార్’ కు అవమానం

Published : May 24, 2017, 06:55 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
చంద్రబాబు సాక్షిగా ఈ ‘ఎన్టీయార్’ కు అవమానం

సారాంశం

ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర మహానాడు సభ నిర్వహించిన విషయం తెలిసిందే.

ఎన్టీయార్ జపం చేయకుండా టీడీపీ లో ఏ ఒక్కరు ఓట్లు అడగరు. కనీసం పార్టీ కార్యక్రమాలను కూడా ప్రారంభించరు.

 

అంతేనా టీడీపీ నిర్వహించే సభలో ఎన్టీయార్ వేషదారణలో ఎవరైనా కనిపిస్తే నిజంగా ఎన్టీయార్ వచ్చినట్లే ఫీలవుతారు. ఆయనను ఆ స్థాయిలో గౌరవిస్తారు.

 

కానీ, ఈ రోజు తెలంగాణ టీడీపీ నిర్వహించిన మహానాడులో ఓ ఎన్టీయార్ వేషదారికి అవమానం జరిగింది.

 

ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర మహానాడు సభ నిర్వహించిన విషయం తెలిసిందే.

 

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సభా వేదికమీదకు రాగానే ఎన్టీయార్ వేశదారణలో ఉన్న పార్టీ కార్యకర్త ఒకరు బాబుకు దగ్గరకు వచ్చారు.

 

అయితే పక్కనే ఉన్న తెలుగు తమ్ముడు ఆయనను వెనక్కి నెట్టారు. వేదిక మీద నుంచి భుజం పట్టుకొని మరీ పక్కకు  పడేశాడు.

PREV
click me!

Recommended Stories

Revanth Reddy: లాగులో తొండలు విడిచి కొడతా కేటీఆర్ పై రేవంత్ రెడ్డి సెటైర్లు | Asianet News Telugu
Bank Holidays : జనవరి 2026 లో ఏకంగా 16 రోజుల బ్యాంక్ హాలిడేస్... ఏరోజు, ఎందుకు సెలవు?