బాల్క సుమన్ మీద జగ్గారెడ్డి సంచలన ఆరోపణ

First Published 3, Jun 2017, 5:23 PM IST
Highlights

"నీపై ఆరోపణలు ఉన్నాయి.ఉద్యమ సమయంలో కేసీఆర్ వద్ద మార్కులు కొట్టేయడానికి ఇద్దరు విద్యార్థులను బలి తీసుకున్నావు.
తెలంగాణ పేరుతో నువ్వు చేసిన హత్యలు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తేల్చుతాం," అని హెచ్చరిక చేశారు.

 

కాంగ్రెస్ సంగారెడ్డి  నేత తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) ఈ రోజు పెద్దపల్లి ఎంపి బాల్క సుమన్ (పై ఫోటో) కు వ్యతిరేకంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణా పేరుతో సుమన్ హత్యలు చేశాడని ఆయన తీవ్రమయిన ఆరోపణ చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ విషయాలను వెల్లడిస్తానని కూడా చెప్పారు.

ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ," నన్ను గుండుకొట్టిచ్చి హైదరాబాద్ లో తిప్పుతానంటున్నావ్.నీ సవాల్ ను స్వీకరిస్తున్నా.
నన్ను ముట్టుకునే దమ్ముందా?," అని జగ్గారెడ్డి  చాలెంజ్ చేశారు.
బాల్క సుమన్ ఓ బచ్చా అని వ్యాఖ్యానించారు.

"నీపై ఆరోపణలు ఉన్నాయి.ఉద్యమ సమయంలో కేసీఆర్ వద్ద మార్కులు కొట్టేయడానికి ఇద్దరు విద్యార్థులను బలి తీసుకున్నావు.
తెలంగాణ పేరుతో నువ్వు చేసిన హత్యలు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తేల్చుతాం," అని హెచ్చరిక చేశారు.

ఓయూలో కేసీఆర్ తో సభ పెట్టించే దమ్ము బాల్క సుమన్ కు ఉందా? అని సవాల్ విసిరారు.

‘‘అదే ఓయూలో మేం సభ పెడతాం.హైదరాబాద్ లో నిన్ను తిరగకుండా చేయగలను.
కేసీఆర్, హరీష్ లే సంగారెడ్డికి రావడానికి జంకుతారు.’’ అని జగ్గారెడ్డి అన్నారు.

 

రెండు రోజుల కిందట విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలకు ఇది స్పందన.

‘అధాారాలు లేకుండా కెసిఆర్ మీద వ్యక్తి గత విమర్శులు చేస్తే, గుండు కొట్టి వూరేగిస్తాం, జాగ్రత్త గా ఉండు,’ అని సుమాన్ హెచ్చరిక చేసిన సంగతి తెలిసిందే.

 సుమన్ హెచ్చరిక ఇక్కడ ఉంది.

 

Last Updated 26, Mar 2018, 12:02 AM IST