హరీశ్ కు జన్మదినశుభాకాంక్షలు ట్వీట్ చేసిన కెటిఆర్

Published : Jun 03, 2017, 03:04 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
హరీశ్ కు జన్మదినశుభాకాంక్షలు ట్వీట్ చేసిన కెటిఆర్

సారాంశం

శనివారం నాడు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుకు  ఐటి మంత్రి కె తారకరామారావు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. హరీష్ రావు సమర్థవంతుడైన నాయకుడని కెటిఆర్ కొనియాడారు. స్పష్టమైన భావప్రకటన, కష్టపడేతత్వం, సామర్థ్యం కలిగిన కొంతమంది నాయకుల్లో ఒకరైన హారీష్ రావు అని ప్రశంసించారు.  జన్మదిన శుభాకాంక్షలని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. 

నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుకు ఐటి మంత్రి కె తారకరామారావు  శనివారం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హరీష్ రావు సమర్థవంతుడైన నాయకుడని కెటిఆర్ కొనియాడారు. స్పష్టమైన భావప్రకటన, కష్టపడేతత్వం, సామర్థ్యం కలిగిన కొంతమంది నాయకుల్లో ఒకరైన హారీష్ రావు అని ప్రశంసించారు.  జన్మదిన శుభాకాంక్షలని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ కూడా ట్విటర్ ద్వారా హరీశ్‌రావుకు జన్మదిన  శుభాకాంక్షలు తెలిపింది.

 

 

 

ఇద్దరి మధ్య నాయకత్వం,కెసిఆర్ వారసత్వం  కోసం పోటీ ఉందని చాలా కాలంగా మీడియా కథనాలు వస్తున్నందున, కెటిఆర్ అభినందనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

ఇక సొంతవూరు సిద్దిపేటలో హరీష్  రావు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన ఇంటికి పెద్ద సంఖ్యలో  కార్యకర్తలు తరలి  వచ్చారు. డప్పువాయిస్తూ,పటాకులు పేలుస్తూ వారు తమ యువనాయకుడికి శుభాకాంక్షలుతెలిపేందుకు వచ్చారు. పెద్ద ఎత్తున  స్వీట్లు పంచిపెట్టారు.  అభిమానులతో మధ్యహరీఫ్  కేక్ కట్ చేశారు మంత్రి హరీష్ . కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సీపీ శివకుమార్ లుకూడా హరీష్  రావును కలిసి శుభాకాంక్షలు చెప్పారు

 

 

PREV
click me!

Recommended Stories

Medaram Jathara 2026 : మేడారంకు ఎక్కడెక్కడి నుండి ఆర్టిసి బస్సులుంటాయి.. ఎక్కడి నుండి ఎంత ఛార్జీ..?
Teacher Suspend for Making Reels:పాటలుపాడలేదు పాఠాలునేర్పించా.. బోరుమన్న టీచర్ | Asianet News Telugu