‘రెబెల్’ ఉస్మానియా తెలంగాణా సంబురాలకు దూరం

Published : Jun 03, 2017, 02:28 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
‘రెబెల్’ ఉస్మానియా తెలంగాణా సంబురాలకు దూరం

సారాంశం

ఉస్మానియా ‘రెబెల్’ అని చాటుకుంది. కొడిగడుతున్నపుడ్లా తెలంగాణా ఉద్యమాన్నిరాజేసిన ఉస్మానియా యూనివర్శిటీ జూన్ రెండోతేదీన ప్రశాంతంగా ఉండిపోయింది. బయట హైదరాబాద్ లో హోరెత్తున్న  తెలంగాణా రాష్ట్ర  అవతరణ మూడో వార్షికోత్సవం సందడి ఉస్మానియాను తాకలేదు. విద్యార్థులేకాదు, అధ్యాపకులు కూడా ఈ ఉత్సవాలకు దూరంగా ఉన్నారు. తెలంగాణా జండా ఎగరేయలేదు. జాతీయ పతకా ఎగరేయలేదు. క్యాంపస్ లో నామమాత్ర వేడుకలు కూడా జరగలేదు. అంతటా గంభీరమయిన నిశబ్దం.

ఉస్మానియా ‘రెబెల్’ అని చాటుకుంది. కొడిగడుతున్నపుడ్లా తెలంగాణా ఉద్యమాన్నిరాజేసిన ఉస్మానియా యూనివర్శిటీ జూన్ రెండోతేదీన ప్రశాంతంగా ఉండిపోయింది. బయట హైదరాబాద్ లో హోరెత్తున్న  తెలంగాణా రాష్ట్ర  అవతరణ మూడో వార్షికోత్సవం సందడి ఉస్మానియాను తాకలేదు. విద్యార్థులేకాదు, అధ్యాపకులు కూడా ఈ ఉత్సవాలకు దూరంగా ఉన్నారు. తెలంగాణా జండా ఎగరేయలేదు. జాతీయ పతకా ఎగరేయలేదు. క్యాంపస్ లో నామమాత్ర వేడుకలు కూడా జరగలేదు. అొంతటా గంభీరమయిన నిశబ్దం.

తెలంగాణా ప్రభుత్వం తీరు ఉస్మానియాను నిరుత్సాహ పరించింది. గత మూడేళ్లలో ఉద్యోగాల పట్ల తెలంగాణా ప్రభుత్వం చూపిస్తున్నఉదాసీనత ఉస్మానియా విద్యార్థులను కృంగదీస్తున్నది. అందుకే ఉస్మానియా రెబెల్ గా తయారయింది. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నా క్యాంపస్ లోకి ముఖ్యమంత్రి, మంత్రులు రావడం లేదు. మొన్నామధ్య రాష్ట్రపతి వచ్చినపుడు ముఖ్యమంత్రి కెసిఆర్ సభకు హాజరయినా మాట్లాడలేదు. మాట్లాడితేవిద్యార్థులనుంచి హేళన ఎదురవుతుందని భయంతోనే ముఖ్యమంత్రి మాట్లాడలేదని చెబుతున్నారు. ఇప్పటికీ ముఖ్యమంత్రి ముందు ఆ సవాలు నిలబడే ఉంది. ముఖ్యమంత్రి క్యాంపస్ లో అడుగుపెట్టగలరా?అనేది రోజూ టివి చర్చలలో ఎదో ఒక సందర్భంలో ప్రస్తావనకు వస్తూనే ఉంటుంది.

ఇలాంటి ఉస్మానియా నిన్న మూడేళ్ల తెలంగాణా రాష్ట్ర సంబురాలను బహష్కరించింది. గతంలో  రెండు సార్లు  అధికారికంగా ఎంతో అట్టహాసంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణలో ఉత్సవాలు జరిగాయని విద్యార్థులు చెబుతున్నారు. ఆశ్చర్యంగాఈ సారి క్యాంపస్ మూగవోయింది. మీడియా కథనాల ప్రకారం, సంబురాలు ఘనంగా జరపాలని ప్రభుత్వం నుంచి కానీ ఉన్నత విద్యామండలి నుంచి ఆదేశాలు విశ్వవిద్యాలయానికి అందలేదు. అందుకే అధికారిక కార్యక్రమమేమీ జరగలేదు.

PREV
click me!

Recommended Stories

Jabardasth Anchor Rashmi Gowtham Pressmeet: మీ సంస్కృతి అంతా మా బట్టలపైనే ఉంది| Asianet News Telugu
Harish Rao Comments on Revanth Reddy:టెండర్లురద్దు చేసి సిబిఐవిచారణ జరిపించాలి | Asianet News Telugu