ఈ 13 రోజులు చుక్కలు చూపించారు...కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్‌కు చుక్కలే : జగ్గారెడ్డి

By Arun Kumar PFirst Published Sep 24, 2018, 7:28 PM IST
Highlights

మనుషుల అక్రమ రవాణా కేసులో అరెస్టయిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో కాస్సేపటి క్రితమే ఆయన చంచల్ గూడ జైలు నుండి విడుదలయ్యారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మీడియాతో ఉద్వేగంగా మాట్లాడారు. 

మనుషుల అక్రమ రవాణా కేసులో అరెస్టయిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో కాస్సేపటి క్రితమే ఆయన చంచల్ గూడ జైలు నుండి విడుదలయ్యారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మీడియాతో ఉద్వేగంగా మాట్లాడారు. 

ఈ 13 రోజులు జైళ్లో చుక్కలు చూశానని జగ్గారెడ్డి అన్నారు. ఇలా తాను జైలుపాలవడానికి కారణమైన కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చుక్కలు చూపించడం ఖాయమని అన్నారు. 

తనన రాజకీయంగా దెబ్బతీసేందుకే తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేశారని జగ్గారెడ్డి ఆరోపించారు. తనను ఎవరూ ప్రశ్నించొద్దనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఈ అక్రమ అరెస్ట్ చేయించారని మండిపడ్డారు. 14 సంవత్సరాల తర్వాత పోలీసులు సుమోటా కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం రాజకీయ కక్షసాదింపులో భాగమేనని జగ్గారెడ్డి అన్నారు. 

రాజకీయాల్లో ప్రజల మన్ననలు పొంది ప్రత్యర్థిని ఓడించాలే గానీ ఇలా భయపెట్టి కాదని జగ్గారెడ్డి సూచించారు. 60 ఏళ్ల జీవిత చరిత్రలో నీపై కేసు లేవా అంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు. రాహుల్ గాంధీ సభ జరిపినప్పటి నుండి తనపై పగపట్టారని అన్నారు. తెలంగాణ ప్రజల కష్టాల గురించి తెలుసుకోవడం... ఉద్యమించడమే తాను చేసిన తప్పా అని ప్రశ్నించారు. ఆలా మానసికంగా ఇబ్బంది పెడితే ప్రజల పక్షాన పోరాడలేమని,ఈ  సాంప్రదాయం మంచిది కాదన్నారు. ఇలాంటి పనులు మానుకోవాలని కేసీఆర్ కుటుంబానికి సూచించారు.  

ఇన్ని రోజులు లేనిది...ఎలక్షన్ సమయంలోనే తాను తప్పు చేసినట్లు అనిపించిందా? అని ప్రశ్నించారు. ఇలా బ్లాక్ మెయిల్ చేయడంతో ప్రతిపక్ష నాయకులంతా భయపడిపోతున్నారని అన్నారు.  ప్రజాస్వామ్య పద్దతిలో ప్రజల కోసం పోటీ పడదాం అని అన్నారు. పోలీసులు కూడా పక్షపాతంగా వ్యవహరించవద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల జోలికి రావద్దని కేసీఆర్, హరీష్ లకు హెచ్చరించారు. ఇంత దైర్యంగా ఉండే తననే భయపెడుతున్నారంటే మరోసారి అధికారంలోకి వస్తే ప్రతిపక్ష నాయకులే రాజకీయాలు చేయడానికి భయపడతారని జగ్గారెడ్డి అన్నారు. 

మనుషుల అక్రమరవాణా: 3 రోజుల పోలీసు కస్టడీకి జగ్గారెడ్డి

మనుషుల అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి అరెస్టు

తప్పించుకునేందుకు జగ్గారెడ్డి ఎత్తు: సంగారెడ్డి బంద్ కు పిలుపు

మాకు పాస్‌పోర్టులే లేవు: జగ్గారెడ్డి భార్య నిర్మల

click me!