సోనియాను తిట్టిన రేవంత్‌కి పీసీసీ చీఫ్ ఇచ్చారు, నా పదవులు తీసేశారు: జగ్గారెడ్డి

Published : Mar 22, 2022, 01:39 PM IST
సోనియాను తిట్టిన రేవంత్‌కి పీసీసీ చీఫ్ ఇచ్చారు, నా పదవులు తీసేశారు: జగ్గారెడ్డి

సారాంశం

సోనియాను ఇష్టమొచ్చినట్టుగా తిట్టిన రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చారని, తాను ఏకవచనంతో మాట్లాడానని తన పదవులను తొలగిస్తారా అని రేవంత్ రెడ్డిని జగ్గారెడ్డి ప్రశ్నించారు.  

హైదరాబాద్: తాను ఇంకా ఎంత కాలం శీల పరీక్ష చేయించుకోవాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. మంగళవారం నాడు హైద్రాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.తాను ఏమిటో, Revanth Reddy ఏమిటో కూడా Congress పార్టీ క్యాడర్ కు తెలవాల్సిన అవసరం ఉందన్నారు. సోనియాగాంధీని ఇష్టమొచ్చినట్టుగా దూషించిన రేవంత్ రెడ్డికి PCC  పదవి ఇస్తే ఏకవచనంతో పీసీసీ అధ్యక్షుడిని ప్రశ్నించిన తన పదవులు కట్ చేస్తారా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

TDPలో ఉన్న సమయంలో Sonia gandhiని బలి దేవత అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోను జగ్గారెడ్డి మీడియా సమావేశంలో ప్రదర్శించారు.  ఈ వీడియోలన్నీ సోనియాగాంధీ దృష్టికి వెళ్లలేదని జగ్గారెడ్డి చెప్పారు. 

తాను TRS కు కోవర్ట్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తాను అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ రాజకీయాల్లో నిలబడినట్టుగా జగ్గారెడ్డి వివరించారు. 19 ఏళ్లకే కౌన్సిలర్ గా 27 ఏళ్లకే మున్సిపల్ చైర్మెన్ గా, 34 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాయని ఆయన తెలిపారు. తమ కుటుంబానికి చెందిన వారెవరూ కూడా రాజకీయాల్లో లేరని ఆయన గుర్తు చేశారు. కానీ తాను కౌన్సిలర్ గా విజయం సాధించాలని వ్యూహంతో పనిచేసి కౌన్సిలర్ గా విజయం సాధించినట్టుగా ఆయన చెప్పారు. ఆ తర్వాత మున్సిపల్ చైర్మెన్ గా, MLAగా విజయం సాధించినట్టుగా జగ్గారెడ్డి చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్ లనుండి కాంగ్రెస్ పార్టీలో చేరానని ఆయన చెప్పారు.  తాను టీఆర్ఎస్ లో చేరుతానని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తన మైండ్ సెట్ కు కాంగ్రెస్ పార్టీ సరిపోతుందన్నారు. పార్టీని వీడాలనే ఆలోచన లేదన్నారు. కానీ వి. హనుమంతరావు, మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబులపై కూడా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి పై జగ్గారెడ్డి విమర్శలు చేశారు. 

ముత్యాల ముగ్గు సినిమా హీరోయిన్ పరిస్థితి

ఇటీవల  CLP  కార్యాలయంలో తనను కలిసిన సమయంలో తమ మధ్య వివాదం గురించి ఏమీ మాట్లాడలేదన్నారు. తనతో కలిసి ఫోటోలకు రేవంత్ రెడ్డి పోజులు ఇచ్చిన తర్వాత 20  నిమిషాల పాటు  తమ మధ్య ఎలాంటి విబేధాలపై చర్చించలేదన్నారు. కలిసి పనిచేద్దామని కూడా రేవంత్ రెడ్డి చెప్పలేదని జగ్గారెడ్డి వివరించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు సీరియస్ గా ఉందని తనకు సమాచారం ఉందన్నారు. కేసీఆర్ కు ఏమైనా కావొచ్చన్నారు. యశోదా ఆసుపత్రి, ప్రగతి భవన్  గవర్నర్ కార్యాలయం వద్ద పోలీసులు రక్షణ ఏర్పాటు చేశారన్నారు. మనమంతా అలెర్ట్ గా ఉందామని తనకు  రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. రేవంత్ రెడ్డికి చంద్రబాబు సరిగా ట్రైనింగ్ ఇవ్వలేదేమోనని చెప్పారు. 

వీహెచ్‌ను తక్కువ అంచనా వేయొద్దు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత V. Hanumantha Rao ను ఎలా కంట్రోల్ చేయాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా తీవ్రంగా ప్రయత్నించారన్నారు. ప్రేమతో రాజకీయంగా హనుమంతరావును తన వైపునకు తిప్పుకొనే ప్రయత్నం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేశారన్నారు.తన కూతురు కోసం మంత్రి Harish Raoను వి. హనుమంతరావు కలిశారన్నారు. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లు అధికారంలో ఉన్న సమయంలో సంపాదించని హనుమంతరావు ఇప్పుడు సంపాదించుకొంటారా అని ప్రశ్నించారు. ఆసుపత్రిలో సీరియస్ గా ఉన్న హనుమంతరావు సోనియా గాంధీ ఫోన్ చేస్తే బతికి వచ్చాడని  జగ్గారెడ్డి చెప్పారు.  
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణపై చలిపిడుగు... ఈ నాలుగు జిల్లాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త
Hyderabad: కేవలం రూ. 1 కే కడుపు నిండా భోజనం..