
హైదరాబాద్: Revanth Reddy కి నేను ఝలక్ ఇస్తానని Jagga Reddy స్పష్టం చేశారు. సమయం వచ్చినప్పుడు రాజకీయంగా ఝలక్ ఇస్తానని జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. జగ్గారెడ్డికి చెందిన నాలుగు పార్లమెంట్ ఇంచార్జీల నుండి తొలగిస్తున్నట్టుగా మీడియాకు సమాచారం ఇచ్చి Revanth Reddy ఢిల్లీకి వెళ్లాడని జగ్గారెడ్డి చెప్పారు.
మంగళశారం నాడు హైద్రాబాద్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. జగ్గారెడ్డికి చెందిన నాలుగు పార్లమెంట్ ఇంచార్జీల నుండి తొలగిస్తున్నట్టుగా మీడియాకు సమాచారం ఇచ్చి రేవంత్ రెడ్డి Delhiకి వెళ్లాడని జగ్గారెడ్డి చెప్పారు. జగ్గారెడ్డికి ఝలక్ అంటూ మీడియాలో ప్రచారం చేయించడంతో ఇవాళ తన క్యారెక్టర్, రేవంత్ రెడ్డి క్యారెక్టర్ ను బయట పెట్టడం కోసం ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్టుగా జగ్గారెడ్డి తెలిపారు.
రేవంత్ రెడ్డితోనే తనకు పంచాయితీ ఉందన్నారు. ఉందన్నారు. Congress పార్టీతో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.. ఇది కాంగ్రెస్ పంచాయితీ కాదన్నారు. Telangana ఉద్యమం సమయంలో కూడా తాను తెలంగాణకు వ్యతిరేకంగా తన అభిప్రాయాన్ని చెప్పిన వ్యక్తిని అని జగ్గారెడ్డి గుర్తు చేశారు. జగ్గారెడ్డి ధైర్యం గురించి ఇప్పుడున్న కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారా అని ఆయన అడిగారు.
టీపీసీసీ చీఫ్ పదవి కోసం తనతో పాటు చాలా మంది నేతలు ప్రయత్నించారన్నారు. అయితే పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తామని కూడా తాను గతంలో పలుమార్లు స్పష్టం చేసిన విషయాన్ని జగ్గారెడ్డి గుర్తు చేశారు. తనతో పాటు మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, వి. హనుమంతరావు లాంటి నేతలపై కూడా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉన్నది ఉన్నట్టు చెప్పడం నాకు అలవాటు అని జగ్గారెడ్డి చెప్పారు. ఇటీవల కాలంలో చోటు చేసుకొన్న పరిణామాల గురించి జగ్గారెడ్డి మీడియాకు వివరించారు. 209 రోజుల క్రితం ఉమ్మడి మెదక్ జిల్లాలో రేవంత్ రెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా పర్యటన సమయంలో చోటు చేసుకొన్న పరిణామాలను జగ్గారెడ్డి వివరించారు.
Medak లోని సీఎస్ఐ చర్చిని రేవంత్ రెడ్డి సందర్శన కార్యక్రమం సందర్భంగా మెదక్ జిల్లా నేతలకు ఒక రకంగా తనకు ఓ రకంగా రేవంత్ రెడ్డి చెప్పారని జగ్గారెడ్డి గుర్తు చేశారు. తొలుత రేవంత్ రెడ్డి తనకు ఫోన్ చేసి మెదక్ జిల్లాలో తాను పర్యటనక వెళ్తున్నానని స్థానిక నేతలకు చెప్పాలని రేవంత్ రెడ్డి కోరాడన్నారు. కానీ తనను రావాలని కోరలేదన్నారు. ఈ విషయమై మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహకు పోన్ చేసి సంగారెడ్డికి వచ్చి తనను పికప్ చేసుకొంటానని రేవంత్ రెడ్డి చెప్పారని జగ్గారెడ్డి వివరించారు. ఈ విషయమై దామోదర రాజనర్సింహ తనకు ఫోన్ చేసి మాట్లాడారని జగ్గారెడ్డి మీడియాకు తెలిపారు. దీంతో తాను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పై ఫోన్ లో ఆగ్రహం వ్యక్తం చేశాననని జగ్గారెడ్డి తెలిపారు. ఈ విషయమై మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డికి సమాచారం ఇవ్వడంతో వెంటనే రేవంత్ రెడ్డి తనకు ఫోన్ చేసినట్టుగా చెప్పారు. కానీ రేవంత్ తీరుపై ఆగ్రహంతో ఉన్న తాను ఫోన్ లిఫ్ట్ చేయలేదన్నారు. మరునాడు రేవంత్ రెడ్డి ఫోన్ చేస్తే తాను మాట్లాడానని జగ్గారెడ్డి చెప్పారు. జగ్గారెడ్డిని తీసుకొని తాను మెదక్ కు వస్తున్నట్టుగా దామోదర రాజనర్సింహకు రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. తనతో పార్టీ సీనియర్ నేత కుసుమ కుమార్ కో ఆర్డినేట్ చేస్తారని రేవంత్ రెడ్డి తనకు వివరించారన్నారు. కానీ తనకు సమాచారం ఇవ్వకుండానే దామోదర రాజనర్సింహను తీసుకొని మెదక్ కు రేవంత్ రెడ్డి తీసుకెళ్లారన్నారు.
అదే రోజున జరిగిన సీఎల్పీ సమావేశంలో ఈ విషయమై రేవంత్ రెడ్డిని నిలదీయాలని భావించానని చెప్పారు. కానీ కుసుమ కుమార్ తనకు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే తాను ఈ విషయమై మాట్లాడలేదన్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు కూడా ఈ విషయమై చెప్పానన్నారు. అందుకే సీఎల్పీ సమావేశాన్ని బహిష్కరించి వచ్చినట్టుగా చెప్పారు.