కేసీఆర్ కొత్త నాటకానికి తెరలేపారు.. ధాన్యం కొనేందుకు కేంద్రం సిద్దంగా ఉంది: బండి సంజయ్

Published : Mar 22, 2022, 01:21 PM ISTUpdated : Mar 22, 2022, 01:37 PM IST
కేసీఆర్ కొత్త నాటకానికి తెరలేపారు.. ధాన్యం కొనేందుకు కేంద్రం సిద్దంగా ఉంది: బండి సంజయ్

సారాంశం

వరి ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పూటకో మాట మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) మండిపడ్డారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రాన్ని బద్నాం చేసే కుట్ర జరుగుతోందన్నారు. 

వరి ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పూటకో మాట మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) మండిపడ్డారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రాన్ని బద్నాం చేసే కుట్ర జరుగుతోందన్నారు. వడ్లు మాత్రమే కొనాలంటూ కేసీఆర్ కొత్త నాటకానికి తెరలేపారన్నారు. కేసీఆర్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెలియదని అన్నారు. ధాన్యం కొనేందుకు కేంద్రం సిద్దంగా ఉందన్నారు. అందుకు కేసీఆర్ సహకరించడం లేదని ఆరోపించారు. రైతులు ఇబ్బంది పడుతుంటే చూసి కేసీఆర్ రాక్షస ఆనందం పొందుతున్నారన్నారు. ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. అన్ని రాష్ట్రాల్లో కొంటున్నట్టుగానే తెలంగాణలో కేంద్రం ధాన్యం కొనుగోలు  చేస్తుందన్నారు. కేసీఆర్‌కు కేంద్రంతో ఏదైనా సమస్య ఉంటే దానిపై పోరాడాలని.. రైతుల విషయంలో కక్ష పూరితంగా వ్యవహరించకూడదన్నారు.  

రైతులు వడ్లు మాత్రమే పండిస్తారని.. బాయిల్డ్ రైస్ కాదని అన్నారు. దేశంలో ఎక్కడాలేని సమస్య తెలంగాణలోనే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. మధ్యవర్తిగా రాష్ట్రంలో కేసీఆర్ వడ్లు కొనాల్సిందేనన్నారు. మధ్యవర్తిగా వడ్లు కొన్నందుకు కేసీఆర్‌కు కమిషన్‌ కూడా వెళ్తుందన్నారు. మరోసారి తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తామని కేసీఆర్ చెప్పింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. 

The Kashmir Files వంటి సినిమాలు కేసీఆర్‌కు నచ్చవని బండి సంజయ్ అన్నారు. కశ్మీర్ లో జరిగిన అరాచకాలు వాస్తవం కాదా అని ప్రశ్నించారు. త్వరలో కశ్మీర్ ఫైల్స్ తరహాలో రజకార్ ఫైల్స్, ఓల్డ్ సిటీ ఫైల్స్ తీసుకోస్తామని చెప్పారు. మొన్నటివరకు ముందస్తు ఎన్నికలకు వెళ్తామన్న కేసీఆర్.. ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో షాక్ తిన్నా. కశ్మీర్ ఫైల్స్‌కు ప్రపంచం మొత్తం బ్రహ్మారథం పడుతుందన్నారు. కానీ ఇవేమి కేసీఆర్‌కు పట్టవన్నారు.  టీఆర్‌ఎస్ వచ్చే ఎన్నికల్లో 105 సీట్లు కాదని.. 10 సీట్లు కూడా రావని విమర్శించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 5 Biggest Airports in India : అతిపెద్ద విమానాశ్రయం మన హైదరాబాద్ దే.. ఎన్ని వేల ఎకరాల్లో ఉందో తెలుసా?
CM Revanth Reddy Speech: కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు | Asianet News Telugu