బోయిన్‌పల్లి కేసు: జగద్విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్

By Siva KodatiFirst Published Jan 19, 2021, 6:52 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్ పల్లి కిడ్నాప్ కేసుకు సంబంధించి నిందితుల్లో ఒకరిగా వున్న భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి సికింద్రాబాద్‌ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్ పల్లి కిడ్నాప్ కేసుకు సంబంధించి నిందితుల్లో ఒకరిగా వున్న భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి సికింద్రాబాద్‌ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ వ్యవహారంలో జగత్ విఖ్యాత్ రెడ్డి‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. కిడ్నాప్ కేసులో కీలకంగా వ్యవహరించాడు జగత్ విఖ్యాత్ రెడ్డి. దీంతో అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌, జగత్‌ విఖ్యాత్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై బుధవారం కోర్టులో విచారణ జరగనుంది.

మరోవైపు ఈ కేసులో ఇద్దరు నిందితుల పోలీస్ కస్టడీకి సికింద్రాబాద్ కోర్టు అనుమతి ఇచ్చింది. అపహరణ కేసులో ప్రధాన నిందితురాలిగా వున్న భూమా అఖిలప్రియ వ్యక్తిగత సహాయకులు మల్లిఖార్జున్ రెడ్డి, సంపత్‌లను మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. న్యాయస్థానం ఆదేశాలతో నిందితులను రేపు చంచల్‌గూడ జైలు నుంచి పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. 

ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు.. ఇప్పటి వరకు 19 మందిని అరెస్టు చేశారు. అయితే హఫీజ్‌పేట లాండ్‌ వ్యవహారంలోనే ఈ కిడ్నాప్‌ చేసినట్లు అఖిలప్రియ పోలీసు కస్టడిలో తెలిపారు. ఆమె ఇచ్చిన వివరాల ఆధారంగానే కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

Also Read:అఖిలప్రియకు మరోసారి చుక్కెదురు: బెయిల్ తిరస్కరించిన కోర్టు

కాగా, ఈ కేసులో నిందితుడిగా ఉన్న భార్గవ్‌రామ్‌ ముందస్తు బెయిల్‌ కోసం సికింద్రాబాద్‌ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే . ప్రవీణ్‌ రావు  సోదరుల కిడ్నాప్‌ కేసులో ఏ-3 నిందితునిగా ఉన్న తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించాడు.

కిడ్నాప్ లో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన పిటిషన్​లో పేర్కొన్నాడు. అఖిలప్రియ పేరును కూడా ఈ కేసులో అన్యాయంగా చేర్చారని.. ఏ-1 గా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని ఏ2 గా మార్చి కేవలం నోటీసులు ఇచ్చి పంపారని పిటిషన్​లో తెలిపాడు. 

click me!