నిన్న నూజివీడు సీడ్స్ .. ఇవాళ మరో కంపెనీ, హైదరాబాద్‌లో వరుస ఐటీ దాడుల కలకలం

By Siva Kodati  |  First Published Jul 13, 2022, 2:34 PM IST

హైదరాబాద్ నగరంలో నిన్న నూజివీడు సీడ్స్, దివ్యశ్రీ డెవలపర్స్ కంపెనీల్లో నిన్న ఐటీ దాడులు జరిగిన ఘటన మరవకముందే.. ఇవాళ మరోసారి ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరిపింది. నగరంలోని పవర్ మేక్ కార్పోరేట్ కంపెనీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. 


హైదరాబాద్‌లో బుధవారం ఆదాయపు పన్ను శాఖ దాడులు (it raids) నిర్వహించింది. నగరంలోని పవర్ మేక్ కార్పోరేట్ ఆఫీసులో సోదాలు జరిపారు. దేశవ్యాప్తంగా వున్న పవర్ మేక్ కంపెనీ కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. విద్యుత్ ఉత్పాదక, ఐటీ, ఇన్ ఫ్రా, మైనింగ్ రంగాల్లో ఈ సంస్థ పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు గుర్తించారు. భారత్‌తో పాటు సౌదీ అరేబియాలలో ఈ కంపెనీ ప్రాజెక్ట్‌లు నిర్వహిస్తోంది. ట్యాక్స్ చెల్లింపులపై అవకతవకల ఆరోపణలతో ఐటీ శాఖ దాడులు నిర్వహించినట్లుగా ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. 

ఇకపోతే.. నిన్న కూడా హైదరాబాద్‌లో ఐటీ శాఖ సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. బెంగళూరు నగరానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ దివ్యశ్రీపై ఐటీ అధికారులు మంగళవారం ఏకకాలంలో దాడులు జరిపారు. అలాగే హైదరాబాద్ లోని నూజివీడు సీడ్స్ కంపెనీలోనూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. దివ్యశ్రీ, నూజివీడు సీడ్స్ కంపెనీ మధ్య జాయింట్ లావాదేవీలు వున్నట్లుగా అధికారులు గుర్తించారు. 

Latest Videos

undefined

Also REad:నూజివీడు సీడ్స్ , దివ్యశ్రీ రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఐటీ దాడులు.. రూ.400 కోట్లు అక్రమార్జన గుర్తింపు

దీనిలో భాగంగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలలోని ఈ రెండు సంస్థలకు చెందిన ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు ఈరోజు దాడులు నిర్వహించారు. దేశవ్యాప్తంగా మొత్తం 40 ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరిగినట్లుగా ప్రముఖ తెలుగు వార్తా ఛానెల్ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. 15 రోజుల క్రితం కూడా ఈ వ్యవహారానికి సంబంధించి ఐటీ శాఖ సోదాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. బెంగళూరు కేంద్రంగా దివ్యశ్రీ రియల్ ఎస్టేట్ సంస్థ కార్యకలాపాలను సాగిస్తోంది. 

అక్రమంగా రూ.400 కోట్ల ఆదాయం ఆర్జించినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో రూ.90 కోట్ల ఆదాయాన్ని పక్కదారి పట్టిస్తున్నట్లు నిర్ధారించారు. నకిలీ సేల్స్ తో ఈ రెండు కంపెనీలు భారీగా రుణాలు తీసుకున్నట్లు ఆదాయపు పన్ను శాఖ గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈరోజు నిర్వహించిన సోదాల్లో రూ.3.5 కోట్ల నగదు, రూ.18.50 కోట్ల విలువైన బంగారం, వెండిని అధికారులు సీజ్ చేశారు. నకిలీ ఇన్‌వాయిస్ లతో రూ.28 కోట్ల క్రయ విక్రయాలు నిర్వహించినట్లు ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. రెండు కంపెనీలు కలిసి 3 నగరాల్లో వెంచర్ లు వేసినట్లుగా తేల్చారు. 

click me!