దేవాదుల ప్యాకేజీ 3లోకి చేరిన గోదావరి వరద నీరు: నిలిచిన ప్రాజెక్టు పనులు

By narsimha lode  |  First Published Jul 13, 2022, 2:34 PM IST

వాదుల ప్రాజెక్టు మూడో ప్యాకేజీ లో సర్జ్ పూల్, టన్నెల్ లో గోదావరి వరద నీరు చేరింది. దీంతో ప్రాజెక్టు నిర్మాణ పనులకు ఆటంకం ఏర్పడింది. మరో వైపు వరద నీటిని తొలగించిన తర్వాతే నిర్మాణ పనులు తిరిగి  ప్రారంభించే అవకాశం ఉంది. 
 


వరంగల్:  Devadula Project  మూడో ప్యాకేజీ లో టన్నెల్, సర్జ్ పూల్ లో Godavari  వరద నీరు పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు పనులు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గోదావరి ప్రాజెక్టుపై దేవాదుల ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. దేవాదుల ప్రాజెక్టులో ప్యాకేజీ మూడులో గోదావరి Flood Water పోటెత్తింది. ప్యాకేజీ 3 లోని టన్నెల్, సర్జ్ పూల్ లను వరద నీరు ముంచెత్తింది. మూడో ప్యాకేజీలోనే సుమారు 49 కి.మీ మేర భూగర్బ Tunnel  కూడా ఉంది. అయితే ఈ ప్యాకేజీ పనులు చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే ఈ పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి..ఈ తరుణంలో  ఈ ప్రాజెక్టు పనుల నిర్వహణకు ఆటంకలు ఏర్పడ్డాయి.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో దేవాదుల ప్రాజెక్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ, మెదక్ జిల్లాల ప్రజలకు సాగు, తాగు నీరు అందించే ఉద్దేశ్యంతో 2004లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.  ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మండలం గంగారం వద్ద గోదావరి నదిపై దేవాదుల పనులకు శంకుస్థాపన చేశారు. ప్రతి ఏటా గోదావరి నది నుండి 60 టీఎంసీల నీటిని ఎత్తిపోసే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.

Latest Videos

undefined

 దేవాదుల ప్రాజెక్టులో భాగమైన మొదటి, రెండో దశ  పనులు పూర్తయ్యాయి. మూడో ప్యాకేజీ పనులు కొనసాగుతన్నాయి. ఈ ప్యాకేజీలో  రామప్ప నుండి ధర్మసాగర్ వరకు సొరంగం పనులు చేయాల్సి ఉంది. ఈ టన్నెల్ సుమారు 49 కి.మీ తవ్వాల్సి ఉంది.  ఈ ఏడాది జూన్ నాటికి ఈ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల పనులు ఆలస్యమయ్యాయి. అయితే ఈ సమయంలో గోదావరి వరద నీరు దేవాదుల ప్యాకేజీ 3లోకి చేరడంతో  మరోసారి నిర్మాణ పనులు ఆలస్యమయ్యే అవకాశం లేకపోలేదు. గోదావరి వరద నీరు సర్జ్ పూల్, టన్నెల్ లోకి చేరడంతో భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. వరద నీటిని బయటకు తీసిన తర్వాతే  ఈ విషయమై ఓ అంచనాకు రావొచ్చని అధికారులు చెబుతున్నారు.

గోదావరి నదికి  గత 100 ఏళ్లలో రాని వరద వచ్చింది. సాధారణంగా ఆగష్టు, సెప్టెంబర్ మాసాల్లో గోదావరి నదికి భారీగా వరదలు వచ్చే అవకాశం ఉంది. ానీ ఈ దఫా మాత్రం జూలై మాసంలోనే భారీగా వరదలు వచ్చాయి.భద్రాచలం వద్ద గోదావరికి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. రేపు ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. మహరాష్ట్రతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భారీ ఎత్తున గోదావరికి వరద పోటెత్తినట్టుగా అధికారులు చెబుతున్నారు. 

click me!