హైదరాబాద్‌లోని ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ కంపెనీపై ఐటీ దాడులు.. పలుచోట్ల ఏకకాలంలో సోదాలు..

Published : Aug 23, 2022, 11:09 AM ISTUpdated : Aug 23, 2022, 12:12 PM IST
హైదరాబాద్‌లోని ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ కంపెనీపై ఐటీ దాడులు.. పలుచోట్ల ఏకకాలంలో సోదాలు..

సారాంశం

హైదరాబాద్‌లోని ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ కంపెనీపై ఐటీ అధికారులు సోదాలు చేపడుతున్నారు. నగరంలోని పలుచోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్‌లోని ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ కంపెనీపై ఐటీ అధికారులు సోదాలు చేపడుతున్నారు. నగరంలోని పలుచోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్-45లోని ఫీనిక్స్ సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు కంపెనీ చైర్మన్ చుక్కపల్లి సురేష్, కంపెనీ డైరెక్టర్ల నివాసాలపై కూడా సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మదాపూర్‌లోని ఫీనిక్స్ ఐటీ సెజ్‌పైనా కూడా సోదాలు కొనసాగుతున్నాయి. 

ఇక, ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం చేస్తుంది. వెంచర్స్, రియల్ ఎస్టేట్ ఇన్‌ఫ్రాలో ఫీనిక్స్ పెట్టుబడులు ఉన్నాయి. అయితే ఫీనిక్స్‌లో చాలా మంది రాజకీయ ప్రముఖుల పెట్టుబడులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న సోదాల్లో ఇతర రాష్ట్రాల నంచి వచ్చిన ఐటీ అధికారుల బృందాలు పాల్గొన్నట్టుగా సమాచారం. దాదాపుగా 200 మంది ఐటీ అధికారులు సోదాల్లో పాల్గొన్నట్టుగా పలు తెలుగు న్యూస్ చానల్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ముంబై నుంచి వచ్చిన ప్రత్యేక ఐటీ అధికారుల బృందం పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. 

ఇక, పన్ను ఎగవేత ఆరోపణలపై ఈ సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి ఐటీ అధికారుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే