పాదయాత్రలోనే దీక్షకు బండి సంజయ్: అరెస్ట్ చేసిన జనగామ పోలీసులు

By narsimha lodeFirst Published Aug 23, 2022, 10:32 AM IST
Highlights

బీజేపీ  తెలంగాణ రాష్ట్ర అధ్యక్సుడు బండి సంజయ్ ను మంగళవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.

జనగామ: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బడి సంజయ్ ను మంగళవారం  నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ కార్యకర్తలపై దాడులను నిరసిస్తూ దీక్షకు దిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

 

Breaking : బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్

— Asianetnews Telugu (@AsianetNewsTL)

ఢిల్లీలో లిక్కర్ స్కామ్ కు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్రంలో ఆందోళనలకు దిగింది.ఈ ఆందోళనల సమయంలో బీజేపీ కార్యకర్తలపై దాడులకు నిరసనగా బండి సంజయ్ ఇవాళ దీక్ష చేయాలని ప్లాన్ చేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా తాను బస చేసిన చోటే దీక్ష చేసేందుకు ప్రయత్నించారు.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు. బండి సంజయ్ ను అరెస్ట్ చేసి తరలిస్తున్న పోలీస్ వాహనాన్ని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు.  బండి సంజయ్ ను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పోలీస్ వాహనానికి అడ్డుగా రోడ్డుపై బైఠాయించిన బీజేపీ శ్రేణులను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆందోళనకు దిగిన బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు నమోదు చేయడాన్ని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ తప్పు బట్టారు. ఈ కేసులను నిరసిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగాలని కూడా  బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపునిచ్చింది.  ఈ క్రమంలోనే  ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా తాను బస చేసిన చోటే సంజయ్ దీక్షకు దిగే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు.  ఈ సమయంలో బీజేపీ శ్రేణులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులకు బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకొంది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు సంబంధం ఉందని బీజేపీ ఆరోపించింది. ఈ విషయమై తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్సీ కవిత సోమవారం నాడు ప్రకటించారు. తనపై ఆరోపణలు చేసిన బీజేపీ నేతలపై పరువు నష్టం దావా వేస్తామని కూడా కవిత తెలిపారు. లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నాడు సాయంత్రం  బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు.ఈ ఆందోళన  చేసిన బీజేపీ శ్రేణులపై పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేశారు.బీజేపీ శ్రేణులపై హత్యాయత్నం కేసులు నమోదు చేయడాన్ని బండి సంజయ్ తప్పు బట్టారు.  ఢిల్లీ లిక్కర్ స్కాం లో   టీఆర్ఎస్ నేతలకు సంబంధం ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణలు చేశారు. లిక్కర్ మాఫియాతో టీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో భేటీ అయ్యారని కూడా బండి సంజయ్ ఆరోపణలు చేశారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాం కు సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదని  కవిత ప్రకటించినా కూడా బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. తప్పుడు ప్రచారం చేయడాన్ని మానుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్  బీజేపీ నేతలను కోరారు.

click me!