హైదరాబాదులో మళ్లీ ఐటి దాడులు.. ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు చెందిన 18 చోట్ల ఏకకాలంలో తనిఖీలు..

By SumaBala BukkaFirst Published Jan 4, 2023, 8:58 AM IST
Highlights

హైదరాబాద్ లో బుధవారం ఉదయాన్ని ఐటీరైడ్స్ కలకలం రేపుతున్నాయి. ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు చెందిన 18 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. 

హైదరాబాద్ : హైదరాబాదులో మళ్లీ ఐటి అధికారులు భారీ సోదాలు, ఐటి దాడులు చేపట్టారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఐటీ అధికారులు నలభై కార్లు, మూడు సిఆర్పిఎఫ్ వాహనాల్లో ఐటి అధికారుల  బృందాలు బుధవారం ఉదయమే ఐటీ ఆఫీస్ నుంచి  బయల్దేరాయి. బుధవారం ఉదయాన్నే గచ్చిబౌలిలోని ఎక్స్ ఎల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కార్యాలయాల్లో  ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు సోదాలు చేపట్టారు. 

చెన్నై కేంద్రంగా ఎక్సెల్ కంపెనీ కార్యకలాపాలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా వున్నా ఎక్సెల్ కంపెనీ కార్యాలయాల్లో ఏకంగా 18 చోట్ల.. ఓకేసారి ఐటీ తనిఖీలు  చేపట్టారు. బుధవారం తెల్లవారుజాము నుంచే 18 చోట్ల దాడులు జరుగుతున్నాయి. కంపెనీకి సంబంధించి  ప్రస్తుతం జరుగుతున్న అన్ని కార్యకలాపాలు..  గతంలో జరిపిన లావాదేవీల వివరాలను ఇన్కమ్ టాక్స్ అధికారులు సేకరిస్తున్నారు. 

తెలంగాణలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు.. ఎవరెవరు ఎక్కడెక్కడంటే..

గతంలో ఇన్కంటాక్స్ సంబంధించి అవకతవకలు జరిగినట్లు సమాచారం ఉండడంతో హైదరాబాదులోని ఎక్సెల్ కార్యాలయానికి ఐటి సిబ్బంది భారీగా చేరుకున్నారు. ఐటీ అధికారులు 20 బృందాలుగా  విడిపోయి  ఏకకాలంలో  సోదాలు నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలిలోని ఎక్సెల్ కార్యాలయంతోపాటు బాచుపల్లి, చందానగర్ లో ఏకకాలంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఇన్కమ్ టాక్స్ సంబంధించిన అవకతవకల నేపథ్యంలోనే ఐటీ దాడులు జరుగుతున్నట్లు సమాచారం.

ఇటీవల హైదరాబాద్లోని ఓ మంత్రి, పలువురు పారిశ్రామికవేత్తల ఇళ్లపై ఐటి దాడులు జరిగిన విషయం తెలిసిందే. మళ్లీ తాజాగా ఐటీ దాడులు జరుగుతుండటంతో.. హైదరాబాద్లోని రాజకీయ నాయకులు,  వ్యాపారులు, ప్రముఖ పారిశ్రామిక వేత్తల్లో ఏం జరుగుతుందో అనే ఆందోళన మొదలయ్యింది. 

click me!