బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఇంట్లో నాలుగో రోజు ఐటీ సోదాలు..

By Sumanth KanukulaFirst Published Feb 3, 2023, 12:42 PM IST
Highlights

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఇంట్లో నాలుగో రోజు ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. 5 కార్లలో భారీగా చేరుకున్న ఐటీ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు చేస్తున్నారు. 

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఇంట్లో నాలుగో రోజు ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. 5 కార్లలో భారీగా చేరుకున్న ఐటీ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు చేస్తున్నారు. ముప్పా, వెర్టెక్స్ కంపెనీల్లోనూఐటీ అధికారులు సోదాలులు కొనసాగిస్తున్నారు. ఇక, పన్ను ఎగవేత ఆరోపణలపై ఐటీ అధికారులు ఎమ్మెల్సీ వెంకట్రామి రెడ్డి, పుష్ప లైఫ్‌స్టైల్ సిటీ ప్రాజెక్ట్స్ కంపెనీ స్థలాలు, ముప్పా కన్‌స్ట్రక్షన్స్, వెరిటెక్స్ సంస్థలపై దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ సోదాల్లో పన్నులు చెల్లించకుండా ఉండేందుకు ఓపెన్ ప్లాట్ కొనుగోళ్లు, మెటీరియల్ ప్రొక్యూర్‌మెంట్, ఆఫ్‌ ది రికార్డ్‌ చెల్లింపుల్లో అక్రమ నగదు లావాదేవీలు జరిగినట్లు గుర్తించినట్టుగా ఐటీ వర్గాలు చెబుతున్నాయి. మాజీ ఐఏఎస్ అధికారి అయిన వెంకట్రామి రెడ్డికి నగరంలో రియల్టర్లు, వ్యాపారులతో ఉన్న అనుబంధం గురించి కూడా ఐటీ అధికారులు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అలాగే గత కొన్నేళ్లుగా పన్నులు చెల్లింపులకు సంబంధించిన ఆయన ఆడిటర్లను కూడా ఐటీ అధికారులు ప్రశ్నించారు.

పుష్ప లైఫ్‌స్టైల్ సిటీ ప్రాజెక్ట్స్‌కు చెందిన డైరెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, జయచంద్రారెడ్డి, చరణ్ రాజ్, వారి ఆడిటర్లను కూడా పన్ను రిటర్న్ ఫైలింగ్‌లో ఉల్లంఘనలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఐటీ అధికారులు ప్రశ్నించారు.

click me!