5న మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ బహిరంగ సభ.. ఏర్పాట్ల కోసం కొన్ని రోజులుగా అక్కడే మకాం వేసిన నాయకులు

By Asianet NewsFirst Published Feb 3, 2023, 12:11 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రం వెలుపల జరిగే బీఆర్ఎస్ మొదటి బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ఆ పార్టీ నాయకులు సాయశక్తులా కృషి చేస్తున్నారు. 5వ తేదీన జరిగే ఈ సభలో స్థానికులను పార్టీలోకి చేర్చుకోవాలని నాయకులు ప్లాన్ చేశారు. 

ఫిబ్రవరి 5న మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ జరగనుంది. తెలంగాణ వెలుపల జరగనున్న మొదటి సభను విజయవంతం చేసేందుకు గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నాదేండ్ లోనే మకాం వేశారు. ఈ బహిరంగ సభలో బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ప్రసంగిస్తారు. మహారాష్ట్రలోని వివిధ పార్టీలకు చెందిన స్థానిక నేతలను బీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు నాయకులు ప్లాన్ చేశారు.

నేటి నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. గవర్నర్ తమిళిసై ప్రసంగంపై ఆసక్తి..!

దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, జి.విఠల్ రెడ్డి, టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ రెండు వారాలుగా ఢిల్లీలో మకాం వేశారు. బడ్జెట్ సమావేశాలు తొలి రోజు తర్వాత మరికొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నాందేడ్ చేరుకోనున్నారు.

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై.. అందరికీ బెస్ట్ విషెస్ అని కామెంట్..

అయితే నాందేడ్ జిల్లాలో మకాం వేసిన బీఆర్ఎస్ నాయకులు స్థానికంగా ఉన్న పట్టణాలు, గ్రామాల్లో పర్యటిస్తున్నారు. సర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు, విద్యార్థులు, రైతు సంఘాలతో మాట్లాడుతున్నారు. ఫిబ్రవరి 5వ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరాలని కోరుతున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ.. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మహారాష్ట్రలో కూడా ఆ పథకాలను అమలు చేస్తామని స్థానికులకు హామీ ఇస్తున్నారు. 
 

click me!