అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. తెలంగాణ దేశానికి ఆదర్శంగా మారింది: గవర్నర్ తమిళిసై

Published : Feb 03, 2023, 12:24 PM ISTUpdated : Feb 03, 2023, 01:58 PM IST
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. తెలంగాణ దేశానికి ఆదర్శంగా మారింది: గవర్నర్ తమిళిసై

సారాంశం

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ శాసనసభ, శాసనమండలి సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. 

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. జాతీయ గీతం ఆలాపన తర్వాత గవర్నర్ తమిళిసై శాసనసభ, శాసనమండలి సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. కాళోజీ మాటలతో గవర్నర్ తమిళిసై ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిదని కాళోజీ అన్నారు’’ అని చెప్పారు. తెలంగాణ దేశానికి ఆదర్శంగా మారిందని చెప్పారు. ప్రజల ఆశీస్సులు.. సీఎం నైపుణ్య పాలనతో రాష్ట్రం అభివృద్ది చెందుతుందని అన్నారు. ప్రజాప్రతినిధుల కృషి, ఉద్యోగుల నైపుణ్య పాలనతో రాష్ట్రాభివృద్ది జరుగుతుందని అన్నారు. ఒకప్పుడు తెలంగాణలో విద్యుత్ కోలతు ఉండేవని.. ఇప్పుడు 24 గంటలు నిరంతం విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. 

‘‘దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ చేరింది. తాగునీటి కష్టాలతో తల్లడిల్లిన పరిస్థితి నుంచి రాష్ట్రం బయటపడింది. ఇంటింటికీ సురక్షిత జలాలను  అందిస్తున్నాం. మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్దరించాం. రాష్ట్రంలో పల్లెల రూపురేఖలు మారిపోయాయి. రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. పచ్చదనంలో ప్రపంచ దేశాల మన్నలను పొందుతుంది. 

తెలంగాణలో ఫ్లోరైడ్‌ సమస్య పరిష్కారం అయిందని కేంద్రమే పార్లమెంటులో ప్రకటించింది. దళితబంధు పథకాన్ని ఉద్యమ స్ఫూర్తితో కొనసాగిస్తున్నాం. వృద్ధాప్య పింఛన్‌ వయోపరిమితిని 57 ఏళ్లకు తగ్గించాం. ఎస్టీల రిజర్వేషన్లు 6 నుంచి 10 శాతానికి పెంచాం. 2,471 తండాలకు పంచాయతీ హోదా కల్పించాం. ధాన్యం ఉత్పత్తి 68.17 లక్షల టన్నుల నుంచి 2.02 కోట్ల టన్నులకు చేరింది. రైతు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది.

సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. రాష్ట్ర ఆదాయం రూ.62 వేల కోట్ల నుంచి రూ.1.84 లక్షల కోట్లకు పెరిగింది.  తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం మూడింతలు అయింది. 2014లో ప్రజల తలసారి ఆదాయం రూ. 1.24 లక్షలు ఉంటే.. ఇప్పుడు రూ.3.17 లక్షలకు పెరిగింది. అద్భుత ప్రగతి సాధించిన ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అన్ని రంగాల్లో రాష్ట్ర అభివృద్ధి రెట్టింపు స్థాయిలో జరిగింది. 


వ్యవసాయ రంగంలో తెలంగాణ గొప్ప స్థిరీకరణను సాధించింది. కాళేశ్వరాన్ని రికార్డు సమయంలో నిర్మించాం. ప్రభుత్వం భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులను పూర్తి చేయడంతో.. 73 లక్షల 33 వేల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కలిగింది. త్వరలో కోటి ఎకరాలకు పైగా సాగునీరు అందిస్తాం. పంట పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 65 లక్షల మందికి 65 వేల కోట్ల పెట్టుబడి సాయం అందించాం.  రైతుబంధు పథకం ప్రపంచవ్యాప్త ప్రశంసలు పొందింది. రైతుబీమా పథకం ద్వారా రూ. 5 లక్షలు అందిస్తున్నాం. రైతు బీమా సదుపాయం ప్రపంచంలో మరెక్కడా లేదు. రైతులు పండించిన ప్రతిగింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. తెలంగాణలోని వ్యవసాయ అభివృద్ది దేశవ్యాప్త చర్చ జరుగుతోంది.  యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం చారిత్రక అద్భుతం. కొత్త సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టుకున్నాం. తెలంగాలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రపంచస్థాయి పోలీసింగ్‌కు ఉదాహరణ. తెలంగాణ మోడల్‌‌పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది’’అని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. చివరిలో దాశరథి గేయంతో ప్రసంగాన్ని ముగించారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్