కేసీఆర్ కూలి పని చేసి ఎంత సంపాదిస్తారో చెప్పేసిన ఎర్రబెల్లి

First Published Apr 17, 2017, 12:01 PM IST
Highlights

తొర్రూర్ లో కూలి పని చేయనున్న సీఎం కేసీఆర్

గులాబీ నేతలంతా కూలి పనులతో బిజీ అయిపోయారు. మొన్న మంత్రి కేటీఆర్ ఐస్ క్రీంలు అమ్మి రూ. 5 లక్షలు సంపాదించారు. ఇక నిజమాబాద్ ఎంపీ కవిత ఓ బట్టల షాపులో చీరలు అమ్మి రూ. 8 లక్షలు సంపాదించారు. గులాబీ కూలి దినోత్సవాల్లో భాగంగా ఈ నెల 14 నుంచి వారం రోజుల పాటు ఇలా టీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూలి పనులు చేస్తున్నారు. త్వరలో కేసీఆర్ కూడా కూలి అవతారం ఎత్తనున్నారు.

 

ఇదంతా ఎందుకో తెలుసా... టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడానికట. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ ఏర్పడిన ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహిస్తుండటం రివాజు. అందులో భాగంగానే  సభకు దారి ఖర్చుల కోసం గులాబీ నేతలు, కార్యకర్తలు ఇలా కూలి పనులు చేసి డబ్బులు సంపాదిస్తారు. పార్టీ ఏర్పాటు నుంచి ఇదే పంథాలో గులాబీ కూలి దినోత్సవాలు వారం పాటు నిర్వహిస్తున్నారు.

 

ఈసారి 16 వ ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా బహిరంగ సభను వరంగల్ లో నిర్వహించనున్న విషయం తెలిసిందే.  ఈ సభ కోసం తనవంతుగా ఆర్థికసాయం అందించేందుకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కూడా సిద్ధమయ్యారు. ఆయన కూలి పని చేయడానికి ఎర్రబెల్లి ఇలాఖాను ఎంచుకున్నారు. పాలకుర్తి నియోజకవర్గం లోని తొర్రూరులో ఆయన కూలి పని చేస్తారు.


ఇక్కడ రైతు పొలంలో కూలి పనులు చేసి డబ్బులు సంపాదిస్తారు. అయితే రైతుల కాకుండా అక్కడ వ్యాపార వర్గాలు కేసీఆర్ కు కూలి డబ్బులు చెల్లిస్తారట. దాదాపు రూ. 20 లక్షల వరకు ఈ విధంగా కేసీఆర్ సంపాదించేలా ఏర్పాట్లు చేసినట్లు ఎర్రబెల్లి చెబుతున్నారు.

click me!