చావైనా, సంబురమయిన తెలంగాణలో పాటే...

First Published Sep 18, 2017, 6:50 PM IST
Highlights

తెలంగాణాలో పాట వర్షాకాలపు గోదావరిలాాగా, మంజీరాలాగా గలగల పారుతూ ఉంటుంది. పాట వినిపించని చోటు తెలంగాణ లో ఉండదు.

తెలంగాణాలో సంతోషమయిన, సంతాపమయిన పాటే... ఇక్కడ ప్రతిమనిషి పాటతోనే ప్రశ్నిస్తాడు ప్రభుత్వాన్ని. పాటతోనే పోరాడతాడు. తెలంగాణాలో పాట వర్షాకాలపు గోదావరిలాాగా, మంజీరాలాగా గలగల పారుతూ ఉంటుంది. పాట వినిపించని చోటు తెలంగాణ లో ఉండదు. అయితే, పాట బాధితుల ఆయుధం. అట్టడుగుల వర్గాలు పదును పెట్టుున్న ఆయుధం. ఈ పాటలు పాడేదంతా కూడా ఎస్ సి, ఎస్ టి, బిసిలే.సోమవారం నాడు బతుకమ్మ  చీరెలు పంపిణీ చేయాలని మంత్రులంతా బయలు దేరారు. సందడి చేశారు. అయితే, చీరెలు నాసిరకం అని పేద మహిళలు కని పెట్టారు. వాటిని కాల్చేశారు. చించేశారు. వద్దని   చెప్పేశారు. చాలా చోట్ల  నిరసన పాట రూపం తీసుకుంది. సాయంకాలనికి ఎన్ని పాటలొచ్చాయో. రోడ్ మీద నిరనస సోషల్ మీడియాలో పాటలు... ఒకేసారి దర్శనమీయడం విశేషం

ఇదొక పాట, బతుకమ్మ  నిరసన పాట

***

బతుకమ్మ పండుగ ఉయ్యాలో

బంగారు బతుకమ్మ ఉయ్యాలో

అడొళ్లకు చీరలు ఉయ్యాలో

అగ్గి మీద గుగ్గిలం ఉయ్యాలో

దర తక్కువ చీరలు ఉయ్యాలో

కొపాలు తాపాలు ఉయ్యాలో

కెసిఅర్ సార్ కు ఉయ్యాలో

లేని తలనొప్పాయె ఉయ్యాలో

ఇయ్యకున్నగాని ఉయ్యాలో ఏమి కాకపోవు

ఉయ్యాలో

ఇచ్చి అపవాదు ఉయ్యాలో

తెచ్చుకున్నడమ్మ ఉయ్యాలో

తొందర పడితే ఉయ్యాలో

తిప్పలే వుండది ఉయ్యాలో

చైతన్య తెలంగాణ ఉయ్యాలో

ఉద్యమాల పౌరషం ఉయ్యాలో

అలోచించి సార్ ఉయ్యాలో

అక్కర కొచ్చిది చేయి ఉయ్యాలో

అడపడుచులంతా ఉయ్యాలో

అరిపొస్తున్నారు

కూలి పొయిందని ఉయ్యాలో

కుమిలి పోతున్నారు ఉయ్యాలో

 

 

click me!