కోదండరాం ఆ పార్టీలో చేరుతున్నారా.. ?

First Published Mar 2, 2017, 3:11 PM IST
Highlights

ఇంకా ఆవిర్భవించక ముందే ఒక పార్టీ కోదండరాంను తమ పార్టీలోకి రమ్మని ఆహ్వానంపలుకుతోంది.

తెలంగాణ రాజకీయ జేఏసీ భవిష్యత్తు పై అప్పుడే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జేఏసీలోని ముఖ్య నేతల మధ్య విభేదాలు బయటపడటంతో దాని మనుగడపై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

 

జేఏసీ రాజకీయ పార్టీగా వ్యవహరిస్తోందని, కోదండరాం కావాలనుకుంటే రాజకీయాల్లో చేరోచ్చని కానీ జేఏసీని రాజకీయ పార్టీగా మార్చొద్దని  జేఏసీ కన్వీనర్ పిట్టల రవీందర్ విమర్శించడంతో వివాదం కొత్త మలుపులు తిరుగుతోంది.

 

నిజంగా కోదండరాం జేఏసీని రాజకీయపార్టీగా మార్చబోతున్నారా.. లేక ఆయనే ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరుతారా ..?  ఇప్పటికైతే ఈ ప్రశ్నకు ఆయన నుంచి సమాధానం లేదు. కానీ, ఇంకా పుట్టక ముందే ఒక పార్టీ ఆయనను రా రామ్మని తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది.

 

సీఎం కేసీఆర్‌ వెయ్యి రోజుల పాలన రోజుకో అబద్ధంతోనే సాగుతోందని విమర్శిస్తున్న తెలంగాణ ఉద్యమ వేదిక అధ్యక్షుడు చెరుకు ఆయనను  గద్దె దింపాలంటే రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులన్నీ ఒక్కటవ్వాలని అభిప్రాయపడ్డారు.

 

అలా అభిప్రాయం వ్యక్తం చేయడమే కాదు త్వరలో కొత్త పార్టీ ప్రారంభిచనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడిన జూన్‌ 2న  ‘తెలంగాణ ఇంటి పార్టీ’ పేరుతో పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

 

అంతేకాదు తన పార్టీలో చేరాలని జేఏసీ చైర్మన్‌ కోదండరాంను ఆహ్వానిస్తూ లేఖను పంపినట్లు చెప్పారు.కోదండరాంపై జరిగిన దాడిని తెలంగాణ ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా భావిస్తున్నా మన్నారు.

 

అయితే చెరుకు సుధాకర్ లేఖపై, కొత్త పార్టీలో చేరే అంశం కోదండారం ఇప్పటి వరకు స్పందించలేదు.

click me!