మన ఎవరెస్టు పూర్ణ‌ సినిమా ట్రైలర్ చూశారా...?

Published : Mar 02, 2017, 10:45 AM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
మన ఎవరెస్టు పూర్ణ‌ సినిమా ట్రైలర్ చూశారా...?

సారాంశం

సినిమాలో పూర్ణ‌ కేరక్టర్ ను కూడా తెలంగాణ అమ్మాయే పోషించింది. హైద‌రాబాద్ చెందిన అదితి ఇనాందార్  పూర్ణ రోల్ లో  కనిపిస్తుంది.

తెలంగాణ ఖ్యాతిని ఎవరెస్టు ఎక్కించిన తెలుగు బిడ్డ మాలావత్ పూర్ణ మీద సినిమా వస్తుందనే విషయం మీకు తెలుసా...

 

తెలుగులో కాదు లేండి.. హిందీలో, అది కూడా బాలీవుడ్ దర్శకుడు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 

సినిమా పేరు... పూర్ణ

 

దీనికి కరేజ్ హాస్ నో లిమిట్స్ అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టారు.

 

నిజామాబాద్ జిల్లాకు చెందిన పూర్ణ అతిచిన్న వ‌య‌సులోనే ఎవ‌రెస్టు శిఖ‌రాన్ని అధిరోహించిన విషయం తెలిసిందే.

 

మారుమూల గ్రామం నుంచి అతిపేద కుటుంబంలోంచి వచ్చిన ఈ మట్టిలో మాణిక్యం  14 ఏళ్లకే ఎవ‌రెస్ట్ అధిరోహించి చరిత్ర సృష్టించింది.

 

ఆమె సహసాన్ని త్వరలో మనం తెరపై చూసే అవకాశం కలగబోతోంది. ఇటీవల బాలీవుడ్ లో బయోపిక్ లు భారీ స్థాయిలో విజయవంతం అవుతున్న విషయం తెలిసిందే.

 

ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు, నిర్మాత న‌టుడు  రాహుల్ బోస్.. పూర్ణ జీవిత చ‌రిత్ర‌ను

సినిమాగా తీశారు. ఇదిగో ఇదే ఆ సినిమా ట్రైలర్.

 

సినిమాలో పూర్ణ‌ కేరక్టర్ ను కూడా తెలంగాణ అమ్మాయే పోషించింది. హైద‌రాబాద్ చెందిన అదితి ఇనాందార్ ను పూర్ణ రోల్ లో మెరవనుంది.

 

ఇప్పటికే షూటింగ్ పార్ట్ చాలా వరకు పూర్తి చేసినట్లు సమాచారం. ఈ నెల చివర్లోనే సినిమా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు బాలీవుడ్ టాక్. 

 

ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ కు కూడా యూ ట్యూబ్ నుంచి మంచి స్పందన వస్తోంది.

 

సినిమా ట్రైలర్ లో మన భువనగిరి కోట కూడా తళుక్కున మెరిసింది. అక్కడే పూర్ణ ఎవరెస్టు ఎక్కడానికి కొన్నాళ్లు శిక్షణ తీసుకున్న విషయం తెలిసిందే. సినిమాలో కూడా అదే కోటను చూపించారు.

 

ప్రస్తుతం తాడ్వాయి గురుకుల పాఠ‌శాల‌లో ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రం చ‌దువుతున్న పూర్ణ పర్వతారోహణపై ఆసక్తి చూపడంతో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ ఆమెకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు.

 

మరో విద్యార్థి ఆనంద్‌తో కలిసి 2014 మే 25న ఆమె ఎవరెస్టును అధిరోహించింది.

PREV
click me!

Recommended Stories

KCR Mass Counter on Kavitha: ఓ బిడ్డా.. ఈ బిస్లెరీ లాంటిదే నీ పార్టీ''.. | Asianet News Telugu
Kavitha New TRS Party Impact: క‌విత పార్టీతో ఎవ‌రికి లాభం, ఎవ‌రికి న‌ష్టం.? | Asianet News Telugu