మేయర్ రామ్మోహన్ ట్విట్టర్ మాయాబజార్

Published : May 13, 2017, 08:22 AM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
మేయర్ రామ్మోహన్  ట్విట్టర్  మాయాబజార్

సారాంశం

స్వచ్ఛ హైదరాబాద్ ను సృష్టించేందుకు హైదరాాబాద్ మేయర్ బొంతురామ్మోహన్ కొత్త టెక్నిక్ కనిపెట్టిన విషయం ట్విట్టర్ హల్ చల్  చేస్తా వుంది. హైదరాబాద్ రోడ్లను బాగు చేయడం, చెత్త ఎత్తేయడం మానవమాత్రులకు సాధ్యం కాని విషయం. అందుకని హైటెక్  పద్దతి ఉపయోగించారు మేయర్. చెత్త మాయం చేశారు. అయితే, దొరికిపోయారు. చెత్తమాయం చేసింది, జిహెచ్ ఎం సి వాళ్లుకాదు,  కంప్యూటర్ గ్రాఫిక్స్ కుర్రవాడు. ఈ మాయాజాలం ట్వీట్ ఆయన చేశాడో లేదో తెలియదు గాని, ఆయన  పేరు మీద వైరల్ అవుతూ ఉంది. 

హైదరాబాద్ రోడ్ల మీద మూన్నెళ్లలో ఈ ట్వి ట్టర్ లో చూపినట్లు మేయర్  బొంతురామ్మోహన్  చెత్తను మాయం చేశారని ఆయన ట్విట్టర్ అకౌంట్  ( @bonthurammohan) లో ఈ ఫోటో ప్రత్యక్షమయింది. మూన్నెళ్ల ముందు ఒకరోడ్డు ఎలా ఉండిందో చూపారు. ఆయన మాయాజాలం ప్రయోగించాక రోడ్ ఎలా ఉందో చూడమని ట్విట్టర్ లో మరొక ఫోటో, ఒక వీడియో పెట్టారు. అంతా బాగుంది కాని ఇాది ఫోటో మార్పింగ్ వ్యవహారం. ఈ ఘన కార్యం చేసిన వ్యక్తి ,చెత్తను, చెత్త పక్కనున్న కుక్కను ఎత్తేశాడు గాని, అపక్కను చెట్టపట్టాలేసుకుని  పోతున్న పోరగాళ్లను తీసేయడం మర్చిపోయి, తన అజ్ఞానాన్ని, మేయరు పేరును బజారు కీడ్చాడు. @bonthurammohan లో దీనిమీద రకరకాల స్పందనలు ఉన్నా మేయర్ రామ్మోహన్ నుంచి ఎలాంటి వివరణ రాలేదు. ఇది ఆయన నిజంగా చేశారా లేక ఎవరో ఈ పనిచేశారా తెలియడం లేదు.ట్విట్టర్ లో ఉన్న చిత్రాలివి.

 

దీనిమీద ట్విట్టర్రాయుళ్లు వూరుకుంటారా? ఒకటే దుమ్మెత్తి పోశారు. ఇలా

 

 

 

PREV
click me!

Recommended Stories

కేసీఆర్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు: Palamuru Lift Irrigation Project | Asianet News Telugu
Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా