దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకు ఐఆర్‌బీ సంస్థ లీగల్ నోటీస్ పంపింది. తప్పుడు ఆరోపణలు చేసినందుకు గాను వెయ్యి కోట్లకు పరువు నష్టం దావా వేసింది.
హైదరాబాద్: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కు ఐఆర్ బీ సంస్థ సోమవారంనాడు లీగల్ నోటీస్ పంపింది.వెయ్యి కోట్లకు ఐఆర్ బీ సంస్థ రఘునందన్ రావుకు నోటీసులు పంపింది. ఔటర్ రింగ్ రోడ్డును ఐఆర్ బీ సంస్థకు లీజుకు హెచ్ఎండీఏ ఇచ్చింది. ఔటర్ రింగ్ రోడ్డు లీజును ఐఆర్ బీ కి కేటాయించడంలో అవకతవకలు చోటు చేసుకున్నాయిన మెదక్ ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు. నిబంధనలకు విరుద్దంగా ఐఆర్ బీ సంస్థకు ఓఆర్ఆర్ లీజును 30 ఏళ్లు ఇచ్చిందని రఘునందన్ రావు ఆరోపించారు. ఈ విషయమై ఓఆర్‌బీ సంస్థ రఘునందన్ రావు కు లీగల్ నోటీస్ పంపింది. వెయ్యి కోట్లకు పరువు నష్టం దావా వేసింది.
నిబంధనలకు విరుద్దంగా 30 ఏళ్లకు ఓఆర్ఆర్ లీజుకు ఇచ్చారని బీజేపీ ఆరోపించింది. ఇదే విషయమై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడ విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డికి హెచ్‌ఎండీఏ లీగల్ నోటీసులు పంపింది. రెండు రోజుల క్రితం ఈ విషయమై రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపింది.ఓఆర్ఆర్ లీజు విషయమై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడ విమర్శలు చేశారు. లీజు విషయంలో నిబంధనలను తుంగలో తొక్కారని ఆయన ఆరోపించారు.