మత మార్పిడులు చేస్తే బుల్లెట్లు దించుతాం: ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు

Published : May 29, 2023, 06:32 PM ISTUpdated : May 29, 2023, 06:35 PM IST
మత మార్పిడులు  చేస్తే  బుల్లెట్లు దించుతాం: ఆదిలాబాద్ ఎంపీ  సోయం బాపూరావు

సారాంశం

 ఆడపిల్లల మతమార్పిడులపై  ఆదిలాబాద్  ఎంపీ సోయం బాపూరావు  సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆదిలాబాద్: ఆడపిల్లల మత మార్పిడులపై  ఆదిలాబాద్ ఎంపీ  సోయం బాపూరావు  సంచలన వ్యాఖ్యలు  చేశారు. ఆదిలాబాద్  లో జరిగిన  కార్యక్రమంలో  ఎంపీ సోయం బాపూరావు ఈ వ్యాఖ్యలు  చేశారు.   మతమార్పిడులు  చేస్తే  బుల్లెట్లు దించే సమయం వస్తుందని ఆయన  వార్నింగ్  ఇచ్చారు.  ఆదీవాసీలను  రెండు మతాలకు  చెందిన  వారు బలవంతంగా  పెళ్లి  చేసుకుంటున్నారని  ఆయన  ఆరోపించారు. 

ఆదిలాబాద్  ఎంపీ  సోయం బాపూరావు  వివాదాస్పద వ్యాఖ్యలు  చేస్తూ  మీడియాలో  నిలుస్తుంటారు. ఎంపీగా  విజయం సాధించిన  తర్వాత  ఎంపీ బాపూరావు   మరింత దూకుడుగా వెళ్తున్నారు.   ఏదో ఒక  అంశంపై  సోయం బాపూరావు  వ్యాఖ్యలు  చేస్తున్నారు.   

గత మాసంలో    పార్టీ మారుతారని  సోయం బాపూరావుపై  సోషల్ మీడియాలో ప్రచారం సాగింది.   తన కొడుకు  పెళ్లి కార్డులు పంచేందుకు  అన్ని  పార్టీల నేతలను  కలిసినట్టుగా  సోయం బాపూరావు  చెప్పారు.  రేవంత్ రెడ్డి సహా  ఇతర  నేతలకు   తన  కొడుకు  పెళ్లి  ఆహ్వాన పత్రికలు  ఇవ్వనున్నట్టుగా  ఆయన గత మాసంలో  ప్రకటించారు. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?