దిశ నిందితుల అరెస్ట్‌పై ముందే ఎలా చెప్పారు?: సజ్జనార్‌ను ప్రశ్నించిన కమిషన్

By narsimha lode  |  First Published Oct 12, 2021, 9:40 AM IST


సిర్పూర్కర్ కమిషన్ ఎదుట ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ సోమవారం నాడు హాజరయ్యారు. ఇవాళ కూడ సజ్జనార్ కమిషన్ ముందు హాజరు కానున్నారు. దిశపై అత్యాచారం హత్యతో పాటు నిందితుల అరెస్ట్ గురించి కమిషన్ సజ్జనార్ ప్రశ్నించింది.
 


హైదరాబాద్: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై  రెండు గంటల పాటు సోమవారం నాడు  ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ ను సిర్పూర్కర్ కమిషన్ ప్రశ్నించింది. ఇవాళ కూడా కమిషన్ ముందు సజ్జనార్ హాజరు కానున్నారు.

also read:నిందితుల చేతిలో ఆయుధాలున్నాయా?:సిర్పూర్కర్ కమిషన్ ఎదుట సజ్జనార్ హాజరు

Latest Videos

undefined

సోమవారం నాడు మధ్యాహ్నం మూడు గంటలకు vs sirpurkar commission ముందు sajjanar హాజరయ్యారు.  సాయంత్రం ఐదు గంటల వరకు విచారణ కొనసాగించింది. dishaపై అత్యాచారం, హత్య ఘటనతో పాటు నిందితుల అరెస్ట్  జరిగిన తీరు తెన్నుల గురించి కమిషన్ ప్రశ్నించింది.

ప్రతి రోజూ జరిగే సెట్ కాన్ఫరెన్స్ లో భాగంగా శంషాభాద్ dcp prakash reddy  దిశపై అత్యాచారం, హత్య గురించి తెలిపినట్టుగా సజ్జనార్ కమిషన్ కు వివరించారు. నిందితులకు సంబంధించిన ప్రతి సమాచారం తనకు డీసీపీ వివరించేవాడన్నారు. నిందితుల అరెస్ట్ కు సంబంధించి నమోదైన రికార్డుల కంటే ముందే మీడియా సమావేశం ఏర్పాటు చేయడంపై కమిషన్ సజ్జనార్‌ను  ప్రశ్నించింది.

దిశ హత్యాచారం ఘటనకు సంబంధించిన పురోగతిని డీసీపీ తనకు వివరించడం వల్లే మీడియా సమావేశంలో ఈ విషయాన్ని చెప్పానని సజ్జనార్ కమిషన్ కు వివరించారు.దిశ నిందితుల విచారణతో పాటు ఎన్‌కౌంటర్ జరిగిన తీరు తెన్నులపై కమిషన్ మంగళవారం నాడు సజ్జనార్ ను విచారించే అవకాశం ఉందని సమాచారం.

2019 డిసెంబర్ 6వ తేదీన షాద్‌నగర్ కు సమీపంలోని చటాన్‌పల్లి వద్ద దిశపై అత్యాచారం చేసి హత్య చేసిన ప్రదేశానికి సమీపంలోనే నలుగురు నిందితులు ఎన్‌కౌంటర్ కు గురయ్యారు.

ఈ ఘటనకు సంబంధించి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసే సమయంలో  పోలీసుల నుండి ఆయుధాలు తీసుకొని తమపై కాల్పులు జరిపేందుకు నిందితులు ప్రయత్నించారని ఈ క్రమంలోనే ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసులు గతంలో ప్రకటించారు.

ఈ ఎన్‌కౌంటర్ పై అనుమానాలు వ్యక్తం చేస్తూ  హక్కుల సంఘాల నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై ఉన్నత న్యాయస్థానం సిర్పూర్కర్ కమిషన్ ను ఏర్పాటు చేసింది.

click me!