డింపుల్ హయాతీ కేసులో సాక్షిగా ఐపీఎస్ రాహుల్ హెగ్డే...

By SumaBala BukkaFirst Published May 26, 2023, 12:40 PM IST
Highlights

డింపుల్ హయతి కేసులో ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డేను పోలీసులు సాక్షిగా  పేర్కొంటూ వాంగ్మూలం నమోదు చేశారు. 

హైదరాబాద్ : నటి డింపుల్ హయాతి, ఆమె స్నేహితుడు డేవిడ్‌పై కేసు దర్యాప్తు చేస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులు డీసీపీ ట్రాఫిక్-ఐ రాహుల్ హెగ్డే, అతని గన్‌మెన్, అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌లను సాక్షులుగా చేర్చి వారి వాంగ్మూలాలను నమోదు చేశారు. ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న హెగ్డే డ్రైవర్ ఎం. చేతన్ కుమార్ వాంగ్మూలాన్ని కూడా పోలీసులు నమోదు చేసుకున్నారు.

ఈ కేసుపై న్యాయపరంగా పోరాడతామని హయాతీ తరపు న్యాయవాది పాల్ సత్యనాధన్ డేవిడ్ తెలిపారు. పార్కింగ్ సమస్యపై ఆమె ముఖాముఖిగా ఎదుర్కొన్న తర్వాత, ఆమె ప్రతిష్టను దెబ్బతీయడం, ఆమెను కటకటాల వెనక్కి నెట్టాలనే లక్ష్యంతో అధికారి నటిపై పగ పెంచుకున్నారని అతను పేర్కొన్నాడు.

పొంగులేటి, జూపల్లిలతో ఈటల భేటీ.. గన్‌మెన్లు కూడా లేకుండా రహస్యంగా సమావేశం కావడం వెనక కారణమేమిటి..?

"ఇది పోలీసుల అత్యుత్సాహం తప్ప మరొకటి కాదు. వారి దౌర్జన్యాలను ఎవరూ ప్రశ్నించకపోతే, అంతం ఉండదు. నా క్లయింట్ ప్రశ్నించినందున, ఆమె ఈ సమస్యలన్నింటినీ ఎదుర్కొంటోంది" అని న్యాయవాది డేవిడ్ అన్నారు.

తగిన ఆధారాలు సేకరించిన తర్వాతే ఎఫ్‌ఐఆర్‌ జారీ చేసినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. త్వరలోనే విచారణ పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేస్తాం’ అని వారు తెలిపారు.

హెగ్డే అధికారిక వాహనాన్ని ఉద్దేశ్యపూర్వకంగా ఆమె కారుతో ఢీకొట్టడంతోపాటు అధికారి, నటి నివాసం ఉండే అపార్ట్‌మెంట్ పార్కింగ్ స్థలంలో ఉంచిన ట్రాఫిక్ కోన్‌లను తన్నడంపై జూబ్లీహిల్స్ పోలీసులు హయాతి, డేవిడ్‌లపై కేసు నమోదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

click me!