బైంసా గురుకుల స్కూల్ లో ఇంటర్ విద్యార్ధి సూసైడ్:కేసు నమోదు

Published : Nov 13, 2022, 02:05 PM ISTUpdated : Nov 13, 2022, 03:13 PM IST
బైంసా గురుకుల స్కూల్ లో ఇంటర్ విద్యార్ధి సూసైడ్:కేసు నమోదు

సారాంశం

బైంసాలోని మైనారిటీ గురుకుల స్కూల్ లో ఇంటర్ సెకండియర్ చదివే విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై  మృతుడి పేరేంట్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

నిర్మల్:జిల్లాలోని  బైంసా మైనారిటీ గురుకుల స్కూల్ లో ఇంటర్ సెకండియర్ చదివే నవాజ్ అనే  విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటనపై నవాజ్ పేరేంట్స్ పిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు  చేసుకొని  దర్యాప్తు చేస్తున్నారు.బైంసాలోని జైలబుద్దీన్ కాలనీకి చెందిన నవాజ్ మైనారిటీ గురుకుల స్కూల్ లో ఇంటర్ చదువుతున్నాడు. గురుకుల పాఠశాలలోనే నవాజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. నవాజ్ రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకన్నారు. తోటి  విద్యార్ధుల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్టుగా నవాజ్ ఆ సూసైడ్ నోట్ లో రాసినట్టుగా  సమాచారం. నవాజ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

దేశంలోని పలు  రాష్ట్రాల్లో ప్రతి   రోజూ ఆత్మహత్య కేసు8లు  నమోదౌతున్నాయి.ఆర్ధిక ఇబ్బందులు,  కుటుంబ కలహలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు అనేకం నమోదౌతున్నాయి. ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండంలో ప్రేమ  జంట ఈ నెల 8వ తేదీన ఆత్మహత్య చేసుకుంది. తమ పెళ్లికి పెద్దలు  ఒప్పుకోరని భావించి సుబ్బారావు,తేజలు ఆత్మహత్య చేసుకున్నారు. సుబ్బారావు కూలీ పనులు చేసుకుంటూ  పొట్టపోషించుకుంటాడు. తేజ ఇంటర్ మధ్యలో మానేసింది. వీరిద్దరి మధ్య కొంతకాలంగా ప్రేమ  కొనసాగుతుంది.

తిరుపతిలోని లాడ్జీలో అనూష,కృష్ణారావులు అదే రోజున  ఆత్మహత్య చేసుకున్నారు. అనూష, అదృశ్యమైన, కేసు కోవూరు పోలీస్ స్టేషన్ లో నమోదైంది. తిరుపతిలోని లాడ్జీలో వీరిద్దరూ  ఆత్మహత్య కు పాల్పడ్డారు. అనూషకు మరో  వ్యక్తితో పెళ్లైంది.అయితే అనూష, కృష్ణారావులు ప్రేమించుకున్నారని సమాచారం. పెళ్లైనా కూడ కృష్ణారావునుమర్చిపోలేదు. దీంతో వీరిద్దరూ తిరుపతికి వచ్చిఆత్మహత్యచేసుకున్నారు.బంజారాహిల్స్ ట్రాఫిక్ ఎస్ఐ గా పనిచేస్తున్న రమణ  అల్వాల్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ  ఘటన గత నెల 27న జరిగింది. గత నెల 26నహైద్రాబాద్ లో ని  హస్టల్ లో ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. .గత నెల 20న విశాఖపట్టణంలో వివాహిత పోలీస్ స్టేషన్ ముందే సూసైడ్ చేసుకుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Panic at Hyderabad Gas Stations: యుద్ధం ఎఫెక్ట్! హైదరాబాద్‌లో గ్యాస్ కోసం బారులు | Asianet Telugu
పుకార్లు నమ్మొద్దు.. ఇంధన కొరత లేదు ప్రజలకు సజ్జనార్ విజ్ఞప్తి | Asianet News Telugu